E-Paper
Advertisement

‘ఆదర్శకుటుంబం’ కు దీపావళి కలిసివస్తుందా..?

‘ఆదర్శకుటుంబం’ కు దీపావళి కలిసివస్తుందా..?
Advertisement

Adarshakutumbam : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదర్శకుటుంబం’. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మాటలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ కామెడీ యాక్షన్ మూవీ ఇది. త్రివిక్రమ్ డైలాగ్స్ వెంకీ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఒక డిఫరెంట్ కామెడీ హారర్ చిత్రంగా వచ్చిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందు భారీ హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఒకవైపు మిక్స్డ్ టాక్ వినిపిస్తున్న సరే కలెక్షన్ల పరంగా మాత్రం ఎక్కడ తగ్గకుండా భారీ వస్తువులను సొంతం చేసుకుంటూ వచ్చింది. గత వారంతో పోలిస్తే ఈ వారం ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీపావళి పండుగ ఈ సినిమాకు కలిసి వచ్చిందా? సినిమా కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘ఆదర్శకుటుంబం ‘ కలెక్షన్స్..

వెంకటేష్ సినిమాలకు టాలీవుడ్ లో ఒక మంచి టాక్ ఉందన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతాయని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. గత ఏడది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బిజీ అని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఆ సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఇప్పుడు వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం అయింది. అయితే మొదటి వారం సినిమాకు కలెక్షన్లు పర్వాలేదనిపించాలి అని టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ వీక్ ముగిసే సరికి ఈ సినిమాకు 65 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. 125 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా థియేటర్లలో రిలీజ్ అయినయి సినిమా దాదాపు 55 శాతం వసూలను కలెక్ట్ చేసింది అని తెలుస్తుంది.. ఒకవైపు మిక్స్డ్ టాక్ వినిపిస్తున్న సరే ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం భారీగానే వసూల్ కావడంతో సినిమా భారీ విషయాన్ని సొంతం చేసుకుంది అని వెంకీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

దీపావళి క్యాష్ అవుతుందా..?

Advertisement

ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తయింది. ప్రస్తుతం రెండో వారంలో సినిమా బుకింగ్స్ కూడా జోరుగానే సాగుతున్నాయని తెలుస్తుంది. దీపావళి పండగ సెలవుల వీకెండ్ కలెక్షన్లకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, సినిమా పూర్తిగా సేఫ్ జోన్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.. అయితే ప్రస్తుతం థియేటర్లలో రామాయణ సినిమా కూడా ఉండడంతో ఈ సినిమాకు గట్టి పోటీ అనేది నెలకొంది. బాలీవుడ్ లో రామాయణ సినిమా జోరు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాకు కాస్త ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. మరి ఈ దీపావళి పండుగను ఈ సినిమా ఎంత మేరకు క్యాష్ చేసుకుంటుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. ఇక వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దంగా ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

Also Read :‘స్పిరిట్ ‘ కోసం వంగీ మామా మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

Related News

‘స్పిరిట్ ‘ కోసం వంగీ మామా మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

మృణాల్ ఠాకూర్ ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుంది..?

సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు షురూ… ఘనంగా పసుపు వేడుక!

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

Big Stories

Advertisement
×