E-Paper
Advertisement

టాప్-నాచ్ డిస్‌ప్లే,అల్ట్రా పెర్ఫార్మెన్స్..అసస్ ప్రోఆర్ట్ P16 రివ్యూ ఇదిగో

టాప్-నాచ్ డిస్‌ప్లే,అల్ట్రా పెర్ఫార్మెన్స్..అసస్ ప్రోఆర్ట్ P16 రివ్యూ ఇదిగో
Advertisement

Asus ProArt P16: ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో.. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ , కంటెంట్ క్రియేషన్ చేస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీరందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని టెక్ దిగ్గజం అసస్ మార్కెట్లోకి తీసుకొచ్చిన అద్భుతమైన.. మొబైల్ వర్క్‌స్టేషన్ ‘అసస్ ప్రోఆర్ట్ P16’ (Asus ProArt P16). అసాధారణమైన ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ , ప్రీమియం డిజైన్‌తో వస్తున్న ఈ ల్యాప్‌ టాప్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి? ప్రొఫెషనల్స్ కోరుకునే.. పవర్‌ను ఇది ఎంతవరకు అందిస్తుంది? దీని ధర, పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టెక్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వాల్యూ ఉన్న అసస్ సంస్థ, ఎప్పుడూ కొత్త టెక్నాలజీతో కూడిన డివైజెస్‌ను మార్కెట్లోకి పరిచయం చేస్తుంటుంది. ముఖ్యంగా క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ‘అసస్ ప్రోఆర్ట్ P16’ ల్యాప్‌ టాప్ ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హై-ఎండ్ డివైజ్ డిజైన్, పర్ఫామెన్స్ , ఇతర ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. ప్రీమియం డిజైన్ , బిల్డ్ క్వాలిటీ:

Advertisement

ఈ ల్యాప్‌టాప్‌ను చేతిలోకి తీసుకున్న వెంటనే దీని ప్రీమియం ఫీల్ స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ‘నానో బ్లాక్’ ఫినిషింగ్‌ను అందించారు. దీనిపై ప్రత్యేకమైన యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్ ఉండటం వల్ల ల్యాప్‌టాప్‌పై వేలిముద్రలు పడే అవకాశం చాలా తక్కువ. 16 ఇంచుల స్క్రీన్ సైజ్ కలిగి ఉన్నప్పటికీ, ఇది చాలా సన్నగా, తక్కవ బరువుతో వస్తుంది. ప్రయాణాలు చేసే వీడియో మేకర్స్‌కు, డిజైనర్లకు ఈ డిజైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

2. అద్భుతమైన ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే:

అసస్ ప్రోఆర్ట్ P16 ల్యాప్‌ టాప్‌లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే.. అది దీని డిస్‌ప్లే అనే చెప్పాలి. ఇది అద్భుతమైన 4K ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ ప్యానెల్‌తో వస్తుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ , ప్యాంటోన్ వాలిడేషన్ సపోర్ట్ ఉంది. ఫోటోగ్రాఫర్స్ , కలర్ గ్రేడింగ్ చేసే నిపుణులకు రంగులు అత్యంత సహజంగా, కచ్చితంగా కనిపిస్తాయి. డెల్టా E కలర్ అక్యూరెసీ ఉండటం ప్రొఫెషనల్స్.. వర్క్‌కు చాలా ప్లస్ పాయింట్. ఎక్కువ గంటలు స్క్రీన్ ముందు పనిచేసే.. వారి కళ్ల కోసం లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు.

3. పెర్ఫార్మెన్స్ , ఏఐ పవర్:

Advertisement

హార్డ్‌వేర్ పరంగా ఈ ల్యాప్‌ టాప్ నెక్స్ట్-లెవెల్ పెర్ఫార్మెన్స్‌ను డెలివర్ చేస్తుంది. పవర్ ఫుల్ లేటెస్ట్ ప్రాసెసర్‌తో పాటు, హై-ఎండ్ గ్రాఫిక్స్ కార్డ్ , భారీ మెమరీ సపోర్ట్ దీనిలో లభిస్తుంది. అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, బ్లెండర్ వంటి హెవీ సాఫ్ట్‌వేర్లలో 4K/8K వీడియో ఎడిటింగ్.. చేసేటప్పుడు లేదా 3D రెండరింగ్ చేసేటప్పుడు.. ఎక్కడా లాగ్ అనే మాటే వినిపించదు. లోకల్ ఏఐటాస్క్‌లను వేగంగా పూర్తి చేయడానికి ఎన్పీయూ ఇంటిగ్రేషన్ అద్భుతంగా పని చేస్తుంది.

4.కీబోర్డ్, టచ్‌పాడ్, కనెక్టివిటీ:

దీని కీబోర్డ్ టైప్ చేయడానికి చాలా స్మూత్‌గా ఉంటుంది. టచ్‌పాడ్‌పై ప్రత్యేకంగా అందించిన ‘డైల్‌ప్యాడ్’ఫీచర్ క్రియేటర్లకు ఎడిటింగ్ టూల్స్‌ను వేగంగా.. కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగ పడుతుంది. సౌండ్ ఫీల్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న పవర్‌ ఫుల్ స్పీకర్లను వాడారు. అలాగే వైఫై 7, ఎస్డీ ఎక్స్‌ప్రెస్ కార్డ్ రీడర్, అవసరమైన అన్ని రకాల హై-స్పీడ్ పోర్ట్స్ దీనిలో అందుబాటులో ఉన్నాయి.

Also Read:  రూ.17వేలలోపు ట్యాబ్..అదిరిపోయే ఫీచర్లతో లాంచ్

5. ధర:

అసస్ ప్రోఆర్ట్ P16 ల్యాప్‌టాప్ ధర వేరియంట్.. కాన్ఫిగరేషన్‌ను బట్టి మారుతుంది.ఇండియన్ మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ.4,99,990 నుంచి మొదలవుతుంది. హై-ఎండ్ స్టోరేజ్ , గ్రాఫిక్స్ వేరియంట్ల ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్ , అసస్ అధికారిక రిటైల్ అవుట్‌లెట్లలో కొనడానికి లభిస్తుంది.

అసస్ ప్రోఆర్ట్ P16 అనేది సాధారణ రోజువారీ వాడకం కోసం కాకుండా.. కేవలం ప్రొఫెషనల్ క్రియేటర్లు, హెవీ వర్క్‌లోడ్ ఉండే.. వారి కోసం మాత్రమే తయారైన అద్భుతమైన ల్యాప్‌టాప్. దీని ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఇది అందించే .. పెర్ఫార్మెన్స్, అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీ ఆ పెట్టుబడికి వంద శాతం న్యాయం చేస్తాయి.

Related News

సామాన్యులకు పండగే.. రూ.6000 లోపే వాషింగ్ మిషన్లు.. ఇక చేత్తో ఉతికే పనేలేదు!

వీఐ సంచలన ఆఫర్.. రూ.35 కే OTT ప్యాక్.. నచ్చిన 2 ఓటీటీలు ఎంచుకోవచ్చు!

రూ.17వేలలోపు ట్యాబ్..అదిరిపోయే ఫీచర్లతో లాంచ్

అల్టిమేట్ ఫీచర్లతో..టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్, మీరూ ఓ లుక్కేయండి

కొత్త వైర్డ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్..ఇంత వరకూ లేని ఫీచర్లతో హల్ చల్!

లుక్స్,బ్యాటరీ చూసి ఇయర్‌బడ్స్ కొంటే మోసపోతారు!ఈ ఒక్కటి చెక్ చేస్తే చాలు

కొత్తవి కొనకండి! పాడైపోయిన బల్బులను ఇలా క్షణాల్లోనే రిపేర్ చేయండి!

Big Stories

Advertisement
×