E-Paper
Advertisement

‘స్పిరిట్ ‘ కోసం వంగీ మామా మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

‘స్పిరిట్ ‘ కోసం వంగీ మామా మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?
Advertisement

Spirit Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈయన చేతిలో ఎప్పుడూ అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయి. అయితే ప్రభాస్ ఎన్ని సినిమాలు ఉన్నా కూడా కేవలం ఏడాదికి ఒక్క సినిమాతో మాత్రమే సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 అలాగే సలార్ 2 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలలో ముందుగా ఫౌజీ ప్రేక్షకులు ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు కానీ దానికన్నా ముందు స్పిరిట్ సినిమా వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం భారీ సెట్ ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరి ఆ సెట్ లో ఏం చేస్తున్నారు..? ప్రస్తుతం షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

భారీ సెట్ లో యాక్షన్ సీన్..

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాలకు ఒక క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి అలాగే యానిమల్ చిత్రాలు జనాలని విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటుగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ప్రభాస్తో స్పిరిట్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకో వస్తుంది అని ఇండస్ట్రీవర్గంలో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ను ఏర్పాటు చేశారని తెలుస్తుంది.. ఆ సెట్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చేస్తున్నారని టాక్.. ఇప్పటికే 45 శాతం వరకే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మిగిలిన షెడ్యూల్ ని కూడా పూర్తి చేసి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. మరి త్వరలోనే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

పోలీస్ పాత్రలో ప్రభాస్..

Advertisement

స్పిరిట్ మూవీ డిఫరెంట్ కథతో రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో డార్లింగ్ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు అని ఇప్పటివరకు టాక్ అయితే వినిపించింది. తాజాగా ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు అని ఇటీవల రిలీజైన కొన్ని పోస్టర్లను చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి పోలీస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్, వైలెన్స్‌తో సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే , వచ్చే షెడ్యూల్ లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ లతో పాటు ప్రభాస్ పై కూడా యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కినుంచనున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తర్వాత మరొక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండడంతో త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ ను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి త్వరలోనే ఈ మూవీ నుంచి మరొక కీలక అప్డేట్ రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..

Also Read :మృణాల్ ఠాకూర్ ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Related News

మృణాల్ ఠాకూర్ ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుంది..?

సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు షురూ… ఘనంగా పసుపు వేడుక!

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

Big Stories

Advertisement
×