Sai Dharam Tej Haldi: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈయన పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ పెళ్లి వార్తలను నిజం చేస్తూ సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నవంబర్ 5వ తేదీ తన ప్రియురాలు కిరణ్మయితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం జరిగిన వెంటనే పెళ్లికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి పనులలో భాగంగా మొట్టమొదటిగా నిర్వహించే పసుపు దంచే వేడుకను నిర్వహించారు.
సాంప్రదాయబద్ధంగా పెళ్లి పనులు పసుపు దంచే వేడుకతోనే ప్రారంభం అవుతాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయి తేజ్ పెళ్లి పనులు కూడా పసుపు దంచే వేడుకతో ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పసుపు దంచే వేడుకలో భాగంగా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సందడి చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పసుపు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను ఇట్స్ బిగేన్ అంటూ షేర్ చేశారు. ఇక సాయి తేజ్ పెళ్లికి ఇంకా నెలరోజుల సమయం ఉన్న సంగతి తెలిసిందే.
సాయి తేజ్ కిరణ్మయి(Kiranmayi) నిశ్చితార్థం నవంబర్ 5వ తేదీ ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా మెగా అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక వీరి వివాహం డిసెంబర్ 10వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని హైదరాబాద్ వేదికగా ఈ పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. ఇలా పెళ్లికి సంబంధించిన ముహూర్తం ఖరారు చేసినప్పటికీ ఈ విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం.
ఈ విధంగా పెళ్లి వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్టు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక కిరణ్మయి విషయానికి వస్తే.. ఈమె సాయి తేజ్ స్నేహితురాలని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే కిరణ్మయి ఎవరు? ఆమె ఏం చేస్తారు? తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలకు సంబంధించి ఎక్కడ సమాచారాన్ని తెలియచేయలేదు. మరి కిరణ్ తో సాయి తేజ్ పరిచయం, ప్రేమ గురించి తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలియాలి అంటే సాయి తేజ్ స్పందించాల్సి ఉంది.
Also Read: పాటలు కట్టి బ్రాండ్ చేయాల్సిన పనిలేదు… త్రిగుణ్ కి ఇచ్చి పడేసిన నాగార్జున