E-Paper
Advertisement

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్
Advertisement

Lab Sharath:తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ల్యాబ్ శరత్ తన సినీ జర్నీ తో పాటు పర్సనల్ లైఫ్ , గతంలో చేసిన బిజినెస్ , సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న  పరిస్థితులపై ఆసక్తికర విషయాలను ఇలా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.

తాను ఇప్పటివరకు దాదాపు 500 సినిమాలు, 150కి పైగా యాడ్స్‌లో నటించానని , ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో దాదాపు 27 ఏళ్ల పాటు పనిచేసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ అడుగుపెట్టానని ఫిలింనగర్‌లో అపార్ట్‌మెంట్లు నిర్మించి అమ్మనని తెలిపారు. సాయి బిల్డర్స్ పేరుతో నిర్మాణ కంస్ట్రక్షన్ బిజినెస్ లో అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చారు.

Advertisement

పలువురు సినీ సెలబ్రిటీలు

ఇక తన దగ్గర అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసిన వారిలో దర్శకులు శరత్, వందేమాతరం శ్రీనివాసరావు, మాదాల రవి, దర్శకుడు రవిబాబు, సినిమాటోగ్రాఫర్, నిర్మాత శ్రీనివాస్ రెడ్డి వంటి పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు.

Advertisement

అంతేకాకుండా హైదరాబాద్‌లో కొన్ని చోట్ల భూములు కొని అమ్మనని ,పేపర్ కప్స్ ఇండస్ట్రీతో పాటు మరికొన్ని వ్యాపారాలు కూడా చేశానని తెలిపారు . ముఖ్యంగా ఫిలింనగర్‌లో తాను భూములు కొనుగోలు చేసిన సమయంలో 900 గజాల స్థలం సుమారు రూ.24 నుంచి 25 లక్షల వరకు ఉండేదని, ఇప్పుడు అదే ప్రాంతంలో భూముల విలువ కోట్లకు చేరిందని వివరించారు.ఇక కొన్ని ప్రాంతాల్లో గజం ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉందని చెప్పారు. అయితే వ్యాపారంలో లాభనష్టాలు సహజమని, తాను కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశానని తెలిపారు.

సినిమా టికెట్ ధరలు సామాన్యులకు భారం

ఇక సినిమా టికెట్ ధరల హైక్ పై మాట్లాడుతూ పెద్ద సినిమాల పేరుతో టికెట్ ధరలు భారీగా పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని వాపోయారు.ఒక కుటుంబంలో ఐదుగురు సినిమా చూడాలంటే టికెట్లతో పాటు పాప్‌కార్న్, సమోసాలు, వాటర్ బాటిళ్లకు కలిపి వేల రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్పారు. ఒక సినిమాకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తే, ,మిడిల్ క్లాస్ కుటుంబం నెలలో ఎన్ని సినిమాలు చూడగలదని ప్రశ్నించారు.

సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని అయితే భారీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలకు ఒకే రకమైన టికెట్ ధరలు ఉండాలని తాను అనను అని పెద్ద సినిమాలకు భారీ పెట్టుబడి పెడతారని వాటి ప్రకారమే టికెట్ రేట్లు కూడా ఉండాలని చెప్పుకొచ్చారు.

ఇపుడు మీడియాలో హాట్ టాపిక్

అదే సమయంలో సినిమా బడ్జెట్ ఎంతైనా సరే ఆ భారాన్ని పూర్తిగా ప్రేక్షకులపై వేయకూడదని ,కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, లేదంటే నెల రోజులు ఆగి ఓటీటీలో సినిమా చూసుకుంటారని రియాలిటీ చెప్పుకొచ్చారు. మొత్తంగా దాదాపు 500 పైగా సినిమాల్లో నటించిన శరత్ ఇలా సినిమా టికెట్ రేట్స్ చేసిన కామెంట్స్ ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

ALSO READ:సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

Tags

Related News

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

నటి అతుల్య చంద్ర ఫిర్యాదులో బయటపడ్డ సంచలన నిజాలు!

బాలయ్య రోజూ తెల్లవారుజామున 3 గంటలకే లేస్తారు.. కారణం ఇదే!

500 సినిమాలు చేశా.. కానీ నా పేరు చాలామందికి తెలియదు..ల్యాబ్ శరత్!

Big Stories

Advertisement
×