E-Paper
Advertisement

రామాయణం సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే.. రూ.1600 కోట్ల టార్గెట్!

రామాయణం సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే.. రూ.1600 కోట్ల టార్గెట్!
Advertisement

Ramayana Collections:రామాయణం..సాయిపల్లవి,రణ్‌బీర్ కపూర్ సీతారాములుగా యష్ రావణుడిగా భారీ అంచనాలతో నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సాలిడ్ వసూల్లని రాబడుతుండటం విశేషం.దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా ఈ సినిమా నిర్మించారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయిలో చూపించాలనే ఉద్దేశంతో భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, సెట్టింగ్స్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా మొదటి భాగం బడ్జెట్ సుమారు రూ.1400 కోట్లని ఇన్ సైడ్ టాక్.దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేస్తుందంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.

Advertisement

ఇక బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే హిందీలోనే సుమారు రూ.600 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.1800 కోట్ల టార్గెట్ ఉన్నట్లు తెలుస్తుంది.అంటే సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా భారీ వసూళ్లు సాధించాల్సి ఉంటుందన్న మాట.

తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఇండియాలో మొదటి రోజు సుమారు రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.10 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్‌లో కూడా సినిమాకు రూ.55 కోట్ల వసూళ్లు వచ్చినట్టు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దీంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.130 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది.

Advertisement

రెండో రోజు కూడా సినిమా వసూళ్లు బాగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రెండో రోజు హిందీ వెర్షన్ నుంచి రూ.35 కోట్ల నుంచి రూ.40 నుండి 50 కోట్ల వరకు వసూళ్లు రావచ్చని టాక్ యష్ ఇమేజ్ కారణంగా కన్నడలో కూడా సినిమాకు మంచి వసూల్లనే రాబడుతుంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూరెండో రోజు సుమారు రూ.4 కోట్ల వరకు వసూళ్లు రావచ్చని సమాచారం. ఓవరాల్‌గా చూస్తే రెండో రోజు ఇండియాలో రూ.55 కోట్ల వరకు, ఓవర్సీస్‌లో రూ.15 కోట్ల వరకు వసూళ్లు రావచ్చని తెలుస్తుంది. అంటే రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.65 నుంచి రూ.70 కోట్ల వరకు సాధించే అవకాశం ఉందన్న మాట. దీంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.220 కోట్ల మార్కును చేరుకోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి రామాయణం సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు చూపిస్తోందనడం లో సందేహం లేదు. అయితే రూ.1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1600 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

తొలి రెండు రోజుల వసూళ్లు బాగున్నప్పటికీ, రాబోయే రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్‌లో వచ్చే కలెక్షన్లు ఈ సినిమా బాక్సాఫీస్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయనడంలో సందేహం లేదు.

ALSO READ :శ్రీశ్రీకి సిగరెట్ కొనిచ్చిన దర్శకుడు.. అసలు కథ ఇదే!

Tags

Related News

శ్రీశ్రీకి సిగరెట్ కొనిచ్చిన దర్శకుడు.. అసలు కథ ఇదే!

తేజ సజ్జ నిశ్చితార్థం.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం!

రక్తం మరకలతో కమల్ హాసన్ పవర్‌ఫుల్ లుక్.. సండియర్‌గా మరో సంచలనం!

పింక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న అమీర్ ఖాన్ మేనకోడలు.. ఫోటోలు వైరల్!

అలీ షూటింగ్‌లతో బిజీ.. నేను ఆసుపత్రిలో ఒంటరిగా.. జుబేదా ఆవేదన!

రూమర్లకు చెక్.. పండగకే రాబోతున్న ‘కాకా’ .. డైరెక్టర్ క్లారిటీ!

బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘దాదా’ పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

Big Stories

Advertisement
×