Ramayana Trailer Review : ఇండియన్ పాపులర్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, సన్నీడియోల్, అమితాబ్ బచ్చన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన వంటి నటీనటులు నటిస్తున్న చిత్రం రామాయణం. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు బయటకొచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది. ఆ ట్రైలర్ ఎలా ఉందో ఒక్కసారి మనం చూసేద్దాం..
విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న రామాయణం మూవీ తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దాదాపుగా 4 నిమిషాలపైనే ఉన్న ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటి వరకు రావణుడి క్యారెక్టర్‌ను దాచిపెడుతూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు మొత్తానికి రీవిల్ చేశారు. రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా అందరు కొట్టేసాడు. రాముడిగా రణబీర్ కపూర్ సౌమ్యంతో కూడిన నటన ఆకట్టుకుంది. సీతగా సాయిపల్లవి మెప్పించింది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఎక్కడా ఖర్చుకు వెనక్కి తగ్గకుండా హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ మొదట్లోనే నరుకుంటూ వెళ్లడం, తనని తాను పరిచయం చేసుకొనే సీన్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మూవీకి ఈ ఇంట్రో హైలెట్ సీన్.. థియేటర్లలో జనాలకు గూస్ బంప్స్ పక్కా..
రామాయణం స్టోరీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటికీ రామాయణం గురించి ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ రామాయణ మూవీ జనాలని ఒక అద్భుత ప్రపంచానికి తీసుకెళ్తుంది అని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో అదిరిపోయే విజువల్స్ ఉండడంతో జనాలు కచ్చితంగా దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారు అని అభిప్రాయపడుతున్నారు. ఇందులో రావణుడు ఇంద్రుడితో యుద్ధం.. అలాగే రాముడి స్వయంవరం.. కైకేయి కోరిక.. ఆ తర్వాత వనవాసం.. మనకు తెలిసిన కథే అయినా విజువల్స్ హైలెట్ అనే చెప్పాలి.. నితేశ్ తివారీ దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ అయ్యేలా చేస్తాయి. గూస్ బంప్స్ పక్కా అని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. ప్రతి సీను ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంటుంది. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమా జనాలని మరో లోకానికి తీసుకెళ్తుంది అని ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం పార్ట్ 1ను ఈ ఏడాది నవంబర్ 6న దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఎలా ఉందో మీరు ఇక్కడ చూసేయండి…