Yash Throne: రామాయణం ఇతిహాసం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సాయి పల్లవి (Sai Pallavi)జంటగా నటించిన రామాయణ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో నటుడు యశ్ (Yash)నటించిన సంగతి తెలిసిందే. ఇక రాముడి కంటే రావణాసురుడి(Ravanasura) పాత్రకు మంచి ఆదరణ లభించింది.
ఇలా రావణాసురుడి పాత్రలో నటించిన యష్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రావణాసురుడి కోసం ఈ సినిమాలో ఉపయోగించిన సింహాసనం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ సింహాసనం (Throne)గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సింహాసనం కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేశారు? ఎంత సమయం పట్టింది అనే విషయాలు గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన రమేశ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
యష్ సింహాసనం కోసం ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా తయారు చేశామని తెలిపారు. ముందుగా ఈ డిజైన్ మట్టితో తయారుచేసి అనంతరం దానితో అచ్చును రూపొందించాం. ఆ తర్వాత ఫైబర్‌ను ఉపయోగించి సింహాసనాన్ని నిర్మించారు. ఇందుకోసం 24 క్యారెట్ల మేలిమి బంగారు రేకులను ఉపయోగించి కోటింగ్ చేశామని, ఈ సింహాసనం తయారు చేయటానికి తమకు సుమారు నాలుగు నెలల సమయం పట్టిందని రమేష్ తెలిపారు. అదేవిధంగా ఈ సింహాసనం తయారీ కోసం ఏకంగా కోటి రూపాయల డబ్బు కూడా ఖర్చు అయినట్టు తెలియజేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
రాక్షస రాజు అయినటువంటి రావణాసురుడి సింహాసనం కోసం ప్రత్యేక దృష్టి సారించామని ఈ సింహాసనం తయారీలో భాగంగా ఏ విధమైనటువంటి వీఎఫ్ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడలేదని తెలిపారు. ఇక రామాయణ సినిమా కోసం సుమారు 150 సెట్టింగులు వేసినట్టు ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు. ఇలా ఒక సింహాసనం కోసమే నాలుగు నెలల సమయం తీసుకోవడం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేయసారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సింహాసనం తయారీలో భాగంగా 24 క్యారెట్స్ గోల్డ్ ఉపయోగించడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుని స్పష్టంగా చిత్రీకరించడంతో రామాయణ సినిమాపై ఏ విధమైనటువంటి విమర్శలు లేకుండా మంచి ఆదరణను సొంతం చేసుకుందని చెప్పాలి.
Also Read: ఘనంగా సాయి ధరమ్ తేజ్ కిరణ్మయి నిశ్చితార్థం.. స్పెషల్ అట్రాక్షన్ గా అకీరా!