C.M.Vijay: తమిళనాడులో సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టిన కొద్ది నెలల వ్యవధిలోనే ఈయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక విజయ్ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా విజయ్ ముఖ్యమంత్రి కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినప్పటికీ నటుడిగా ఈయనని వెండితెరపై చూడలేమనే నిరాశ కూడా వ్యక్తం చేశారు.
తాజాగా విజయ్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన తిరిగి మరోసారి నటుడిగా కెమెరా ముందుకు రాబోతున్నారని, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon)దర్శకుడిగా పని చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా చేయటం లేదని తెలుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం స్పాన్సర్స్ చేస్తున్న ఒక ప్రకటనలో భాగంగా నటించబోతున్నట్టు సమాచారం. సాధారణంగా, ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రచారం చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లను తీసుకువస్తుంది. విస్తృత ప్రచారం కోసం వారు సినిమా నటులను తీసుకువస్తారు.
ఇక తమిళనాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయటానికి విజయ్(C.M.Vijay) ఇతర హీరోలను సంప్రదించకుండా ఆయనే నేరుగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఇలా తమిళనాడు ప్రభుత్వానికి , ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేయడానికి స్వయంగా విజయ్ ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన ఈ ప్రకటనను ఒక సినిమా లాగా చిత్రీకరించనున్నారు. అత్యంత వైభవంగా భారీ బడ్జెట్ తో ఈ ప్రకటన ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. . ప్రముఖ చిత్రనిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ ప్రకటనకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
విజయ్ ఆ ప్రకటన చిత్రీకరణ కోసం రెండు రోజులు కేటాయించినట్లు సమాచారం, మరియు రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల తర్వాత ఈ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఇక నటుడిగా కెమెరా ముందుకు రారని భావించిన విజయ్ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనే కెమెరా ముందుకు వచ్చి ఈ ప్రకటనలో కనిపించబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే ఈయన చివరిగా జన నాయగన్(Jananayagan) సినిమాలో నటించారు. ఈ సినిమా ఎన్నికలకు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ విజయ్ సీఎం అయిన తర్వాత విడుదల కావటం విశేషం. ఈ సినిమా తర్వాత విజయ్ ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు.
Also Read: రామాయణ యశ్ సింహాసనం కోసం 24 క్యారెట్ల బంగారం?ఎన్ని నెలల్లో తయారు చేశారో తెలుసా?