Nayan Sarika:టాలీవుడ్‌లో వరుసగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న హీరోయిన్ నయన్ సారిక కి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది.. టాలీవుడ్ టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ కి జోడీగా నటించబోతుందన్న టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాత అవడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
నయన్ సారిక తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణం ఆమె నటించిన సినిమాలే అని చెప్పాలి. అందం, అభినయంతో పాటు పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది.
2024లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గమ్ గమ్ గణేశా’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అంతేకాదు, బెస్ట్ ఫీమేల్ డెబ్యూ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం అందుకోవడం విశేషం
తొలి సినిమాతోనే ఇలాంటి గుర్తింపు రావడం నయన్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది.ఇక అదే ఏడాది వచ్చిన ‘ఆయ్’ సినిమా ఆమెకు మరింత ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరంతో చేసిన ‘క’ సినిమా కూడా హిట్ అవ్వడంతో నయన్ రేంజ్ మారిపోయింది.
ఆ తర్వాత శ్రీవిష్ణుతో ‘విష్ణు విన్యాసం’, ‘రాకాసా’ వంటి చిత్రాల్లో వెరైటీ రోల్స్ చేస్తూ వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. అలా వరుస విజయాలతో మంచి లక్కీ హ్యాండ్‌గా మారిన నయన్ సారిక ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ, కొత్త దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్‌లో ఆమె హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు సమాచారం. ఇక నవంబర్ 11న ఈ సినిమా గ్రాండ్ లాంచ్ జరగనుందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్.
మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ చూస్తే, ‘జోష్’లో చిన్న పాత్రతో మొదలై ‘గుంటూర్ టాకీస్’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ 2022లో వచ్చిన ‘డీజే టిల్లు’, ఆ తర్వాత వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు.అయితే ఆ తర్వాత జాక్ ,తెలుసు కదా వంటి సినిమాలతో డిసప్పాయింట్ చేశాడు,మరి ఈ సినిమా తో నైనా ప్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తాడేమో చూద్దాం !
ALSO READ :కొత్త నిర్మాతలు, దర్శకులకు ధీరజ్ వార్నింగ్.. ప్యాషన్ ఉంటే సినిమా ఇండస్ట్రీలోకి రావొద్దు!