E-Paper
Advertisement

దొంగ నా కొడుకులో ఎమోషన్స్ ఉండవా? మౌళి చెప్పిన సమాధానం ఇదే!

దొంగ నా కొడుకులో ఎమోషన్స్ ఉండవా? మౌళి చెప్పిన సమాధానం ఇదే!
Advertisement

Mouli Little Hearts:‘లిటిల్ హార్ట్స్’ వంటి సూపర్ హిట్ తర్వాత మౌళి నుంచి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయని చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే అందరి కళ్ళు ఇప్పుడు వస్తున్న ‘దొంగ నా కొడుకు’ (DNK) సినిమా పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా నవంబర్ 13న థియేటర్ లలోకి రానున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా పలు విషయాలు చెప్పుకొచ్చాడు.

‘లిటిల్ హార్ట్స్’ తర్వాత చాలా నేర్చుకున్నా!

Advertisement

‘లిటిల్ హార్ట్స్’ సినిమా తన జీవితంలో ఎన్నో కొత్త అనుభవాలను ఇచ్చిందని మౌళి చెప్పుకొచ్చాడు. గతంలో కలుస్తానని కూడా ఊహించని వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని, సినిమా ఇండస్ట్రీలోని వాస్తవ పరిస్థితులను దగ్గరగా తెలుసుకున్నానని తెలిపాడు. ముఖ్యంగా ఒక నటుడిగా మాత్రమే కాకుండా సినిమా నిర్మాణం, బడ్జెట్, ప్రొడక్షన్ వంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకున్నానని వివరించాడు.

తన విజయానికి ఒక్క వ్యక్తి కారణం కాదని, తన చుట్టూ ఉన్న స్నేహితులు, టీమ్, సంగీత దర్శకుడు సింగీ మ్యూజిక్‌తో పాటు సహకరించిన ప్రతి ఒక్కరి కృషి ఉందని తెలిపాడు.తనకు నచ్చిన కథలో తాను ఏం చేయగలను? ఆ పాత్రను ఎలా మెరుగ్గా చూపించవచ్చు? అనే విషయాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పాడు.

Advertisement

నన్ను నెస్లన్‌తో పోల్చడం సంతోషమే.. కానీ!

‘లిటిల్ హార్ట్స్’ విజయంతో మౌళిని మలయాళ నటుడు నెస్లన్‌తో పోలుస్తూ చాలామంది మాట్లాడుతున్న విషయం గురించి తనను ఇతర నటులతో పోల్చడం సంతోషంగానే ఉన్నప్పటికీ, అందరి పరిస్థితులు, అవకాశాలు వేర్వేరుగా ఉంటాయని తెలిపాడు. తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చానని, తన ప్రయాణం ఇంకా మొదటి దశలోనే ఉందని చెప్పాడు.అయితే ప్రేక్షకులు తనపై పెట్టుకున్న అంచనాలను తప్పకుండా అందుకుంటానని, వాళ్లను గర్వపడేలా చేసే సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.

‘దొంగ నా కొడుకు’ ఒక చిల్లర కామెడీ సినిమా!

ఇక తన కొత్త సినిమా ‘దొంగ నా కొడుకు’ గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఒక క్రైమ్ కామెడీ అని, ఇందులో బెట్టింగ్‌కు అలవాటు పడిన ఓ వ్యక్తి ఆ సమస్య నుంచి బయటపడేందుకు దొంగతనానికి పాల్పడే పరిస్థితుల చుట్టూ కథ నడుస్తుందని వివరించాడు.ఈ సినిమాలో ప్రధానమైన అంశం రాబరీ చుట్టూ ఏర్పడే సంఘర్షణ అని తెలిపాడు. అయితే ప్రేక్షకులు ఏదో సందేశం లేదా ఎమోషనల్ డ్రామా ఆశించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

తన మాటల్లో చెప్పాలంటే ఇది సరదాగా చూసి నవ్వుకునే సినిమా. థియేటర్‌కు వెళ్లి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడిపి బయటకు వచ్చేలా ఉంటుందని చెప్పాడు. ప్రతి కామెడీ సినిమాకు తప్పనిసరిగా ఒక ఎమోషనల్ హుక్ లేదా సందేశం ఉండాల్సిన అవసరం లేదని, ఈ కథలో దర్శకుడు పూర్తిగా వినోదానికే ప్రాధాన్యత ఇచ్చాడని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

అలీతో ఫాదర్ రోల్..

ఈ సినిమాలో సీనియర్ నటుడు అలీ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు మౌళి తెలిపాడు. అలీకి ఇందులో చాలా కీ రోల్ దక్కిందని దక్కిందని, ఆయనతో మంచి కామెడీ సన్నివేశాలు ఉంటాయని తెలిపాడు.ఇప్పటివరకు అలీని ప్రేక్షకులు ఎక్కువగా తనదైన కామెడీ శైలిలోనే చూశారని, ఈ సినిమాలో మాత్రం ఒక తండ్రి పాత్రలో చూడబోతున్నారని చెప్పాడు. అలాంటి లెజెండరీ నటుడు తన సినిమాలో మంచి పాత్ర చేయడానికి అంగీకరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

తమిళం నుంచి కూడా అవకాశాలు.

‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందని మౌళి తెలిపాడు.ముఖ్యంగా తమిళ యూత్ లో ఈ సినిమాకు మంచి గుర్తింపు రావడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పాడు. మలయాళ ప్రేక్షకులు కూడా సినిమాను చూశారని తెలిపాడు.

ఈ సినిమా తర్వాత తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శకులు తనను సంప్రదించారని, కొన్ని కథలు కూడా వినిపించారని వెల్లడించాడు. కథలు కుదిరి, సరైన పరిస్థితులు ఏర్పడితే భవిష్యత్తులో ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.తన  సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఏ ప్రాజెక్టును కూడా అధికారికంగా ఖరారు చేసుకోలేదని మౌళి స్పష్టం చేశాడు. మంచి కథలు వస్తే వరుసగా సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

Tags

Related News

రామాయణ యశ్ సింహాసనం కోసం 24 క్యారెట్ల బంగారం?ఎన్ని నెలల్లో తయారు చేశారో తెలుసా?

ఘనంగా సాయి ధరమ్ తేజ్  కిరణ్మయి నిశ్చితార్థం.. స్పెషల్ అట్రాక్షన్ గా అకీరా!

చల్లని సముద్రంలో మానస చౌదరి.. సూర్యాస్తమయం వేళ అందాల విందు!వీడియో వైరల్

నయన్ సారికకు మరో లక్కీ ఛాన్స్.. ఈసారి టిల్లు బాబుతో రొమాన్స్!

అందాల విందుతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మౌనీ రాయ్!

కొత్త నిర్మాతలు, దర్శకులకు ధీరజ్ వార్నింగ్.. ప్యాషన్ ఉంటే సినిమా ఇండస్ట్రీలోకి రావొద్దు!

పబ్జీ, ఫ్రీ ఫైర్ కాదు.. మా చిన్నప్పుడు క్రికెట్టే పండగ! రాజీవ్ కనకాల

Big Stories

Advertisement
×