E-Paper
Advertisement

అందాల విందుతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మౌనీ రాయ్!

అందాల విందుతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మౌనీ రాయ్!
Advertisement

Mouni Roy:బాలీవుడ్ అందాల భామ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చెప్పక్కర్లేదు.ఎప్పటికప్పుడు తన ఫొటోలు, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విశేషాలు, ఫ్యాషన్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఎప్పటిలాగే గ్లామరస్ షో కాకుండా ఈసారి జీవితంపై తనకున్న ఆలోచనలను కూడా అభిమానులతో పంచుకోవడం విశేషం.

మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. “In every prayer, a hope that gleams. With gratitude in every heart, Let love and light never depart..” అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్ అయిపొయింది. ప్రతి ప్రార్థనలోనూ ఒక ఆశ వెలుగుతూనే ఉంటుందని, ప్రతి మనసులో కృతజ్ఞత ఉండాలని, జీవితంలో ప్రేమ, వెలుగు ఎప్పటికీ దూరం కాకూడదని ఈ లైన్స్ వెనక అర్థం అని తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ పోస్ట్‌లో మౌనీ రాయ్ ట్రెడిషనల్ డ్రెస్ లో రెడీ అయిన తీరు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.రాయల్ బ్లూ కలర్ ఎత్నిక్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయిన ఈ బ్యూటీ, దాని లికి వెండి రంగు ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన బ్లౌజ్‌ను ధరించడంతో మ్యాచింగ్ అంటే మౌనీ రాయ్ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.

ఇక మౌనీ రాయ్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. టీవీ నుంచి బాలీవుడ్ వరకు ఆమె జర్నీ క్రేజీ అనే చెప్పాలి. మొదటగా బుల్లితెరపై కెరీర్ మొదలెట్టిన ఆమెకు ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్ మంచి గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పాలి. ఇందులో కృష్ణ తులసి పాత్రలో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.

Advertisement

ఆ తర్వాత ‘కస్తూరి’, ‘దో సహేలియాన్’, ‘జునూన్ – ఐసీ నఫ్రత్ తో కైసా ఇష్క్’ వంటి టీవీ ప్రాజెక్టుల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందిన ‘దేవోన్ కే దేవ్.. మహాదేవ్’ సీరియల్‌లో సతీదేవి పాత్ర ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయిందని చెప్పాలి.

అయితే మౌనీ రాయ్‌కు నేషనల్ వైడ్ గా పాపులారిటీ తీసుకొచ్చిన సీరియల్ మాత్రం ‘నాగిని’. ఇందులో శివన్య పాత్రలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘నాగిని 2’లో శివంగి, శివన్య పాత్రల్లో కనిపించి మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.అలా 2018లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’ సినిమాతో హిందీ లోకి ఎంట్రీ ఇచ్చిన మౌనీ ఈ సినిమాలో మోనోబినా దాస్ పాత్రలో కనిపించి అలరించింది .

తర్వాత జాన్ అబ్రహం నటించిన ‘రోమియో అక్బర్ వాల్టర్’లో శ్రద్ధా శర్మ, పారుల్ పాత్రల్లో నటించింది. ఇక అదే ఏడాది కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్: చాప్టర్ 1’లో గాలి గాలి పాటలో లూసీగా ప్రత్యేకంగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

2019లో ‘మేడ్ ఇన్ చైనా’ ,2022లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ వంటి నటులు నటించిన ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ’ సినిమాలో జునూన్ పాత్రలో మెరిసిన మౌనీ 2024లో ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2’, ‘బ్లాక్‌అవుట్’ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇక ‘షో టైమ్’ వెబ్ సిరీస్‌లో యాస్మిన్ అలీగా, ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’లో నయనతార పాత్రలోనూ కనిపించిన ఈ భామ కేవలం నటనకే పరిమితం కాకుండా ఫ్యాషన్, డ్యాన్స్, మ్యూజిక్ వీడియోలతోనూ అభిమానులను అలరిస్తూ ఉండటం విశేషం.మొత్తంగా ఒక వైపు సినిమాలతో సందడి చేస్తూనే వరుస పోస్టులతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ !

Tags

Related News

కొత్త నిర్మాతలు, దర్శకులకు ధీరజ్ వార్నింగ్.. ప్యాషన్ ఉంటే సినిమా ఇండస్ట్రీలోకి రావొద్దు!

పబ్జీ, ఫ్రీ ఫైర్ కాదు.. మా చిన్నప్పుడు క్రికెట్టే పండగ! రాజీవ్ కనకాల

టికెట్ రూ.150.. పాప్‌కార్న్ రూ.220! ధరలపై నిర్మాత ధీరజ్ షాకింగ్ కామెంట్స్

కిడ్నాప్ చేయబోయి అడ్డంగా బుక్కైన గ్యాంగ్.. సుధీర్ గోట్ ట్రైలర్ ఎలా ఉందంటే?

ప్రదీప్, నస్లెన్‌తో నన్ను పోల్చకండి బాబోయ్.. మౌళి అసలు బాధ ఇదే!

‘అచ్చం నల్ల చీర.. చీర అంచున మల్లెమొగ్గ’ సోషల్ మీడియాను ఊపేస్తున్న గద్దర్ నరసన్న ఫోక్ సాంగ్

వియత్నాంలో కావ్య కళ్యాణ్ రామ్ బ్యాచిలర్ పార్టీ.. ఫోటోలు వైరల్!

Big Stories

Advertisement
×