Manasa Chowdary:టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో యూత్ ని ఆకట్టుకుంటున్న మానస చౌదరి మరోసారి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ని అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు,వీడియోలు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి.
సముద్రపు ఒడ్డున సూర్యాస్తమయం వేళ తీసుకున్న ఈ ఫొటోల్లో మానస ఎంతో అందంగా కనిపిస్తోందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.ఇక ఈ ఫొటోలకు ‘‘Freezing cold beach. Beautiful sunset. Kuncham manashanthi’’ అంటూ తన మనసులోని మాటల్ని క్యాప్షన్ రూపంలో పెట్టేయడం ఇపుడు హట్ టాపిక్ అయిపొయింది.చల్లని సముద్రపు ఒడ్డు, అందమైన సూర్యాస్తమయం, కొంచెం మనశ్శాంతి అంటూ ఆమె చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు అర్థమవుతోంది.
సాధారణంగా సినిమా షూటింగులు, ప్రమోషన్లు, ప్రయాణాలతో బిజీగా ఉండే సెలబ్రిటీలకు ఇలాంటి వెకేషన్ చాలా అవసరమని చెప్పక్కర్లేదు. అందుకే కాబోలు మానస కూడా ఇలా వెకేషన్ లో రచ్చ చేస్తుంది .ఇక ఈ ఫొటోల్లో మానస ఎరుపు రంగు దుస్తుల్లో సముద్రపు నీటిలో నిలబడిన తీరుకు ఫిదా అవుతున్నారు ఫాన్స్.
ఇక మానస చౌదరి సినిమాల విషయానికి వస్తే తెలుగులో రవికాంత్ పేరేపు దర్శకత్వంలో వచ్చిన ‘బబుల్‌గమ్ (Bubblegum)’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇందులో రోషన్ కనకాలకి జోడీగా జాన్వీ పాత్రలో నటించి యూత్ ని మెస్మరైజ్ చేసింది.
ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్ (Lucky Baskhar)’ సినిమాలో మోనా పాత్రలో కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసిన ఈ భామ ‘సింగిల్ ’ సినిమాలో మమతా కులకర్ణి పాత్రలో నటించి మెప్పించింది. అలాగే విష్ణు విశాల్ నటించిన తమిళ చిత్రం ‘ఆర్యన్ (Aaryan)’, ‘DNA’ వంటి సినిమాల్లోనూ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇక 2026లో ‘గాయపడ్డ సింహం (Gaayapadda Simham)’, ‘ముస్తఫా ముస్తఫా (Mustafa Mustafa)’ సినిమాల్లోనూ సందడి చేసిన ఈ అమ్మడు సినిమాలతో పాటు ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్‌లోనూ కనిపించి మెప్పించింది కూడా. ఇలా తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను పట్టేస్తూ ఎక్కడా గ్యాప్ రాకుండా చూసుకుంటుంది మానస.
మొత్తంగా ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటోంది ఈ అమ్మడు.అప్పుడప్పుడు తన ఫొటోషూట్లు, వెకేషన్ విశేషాలు, వ్యక్తిగత జీవితంలోని మెమొరీస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిగో తాజాగా అదే క్రమంలో సముద్రపు ఒడ్డున సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ పెట్టిన ఈ ఫొటోలు కూడా అందులో భాగమే అని చెప్పక తప్పదు !
Freezing cold beach. Beautiful sunset. Kuncham manashanthi 😄 pic.twitter.com/sS70nKubf3
— Cherukuri Maanasa choudhary (@Maanasa_chou) November 5, 2026