E-Paper
Advertisement

ఘనంగా సాయి ధరమ్ తేజ్  కిరణ్మయి నిశ్చితార్థం.. స్పెషల్ అట్రాక్షన్ గా అకీరా!

ఘనంగా సాయి ధరమ్ తేజ్  కిరణ్మయి నిశ్చితార్థం.. స్పెషల్ అట్రాక్షన్ గా అకీరా!
Advertisement

Sai Dharam Tej Engagment: మెగా కాంపౌండ్ లో పెళ్లి భాజలు మోగబోతున్నాయి. గత కొద్దిరోజులుగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ వార్తలకు పులిస్టాప్ పెడుతూ మెగా ఫ్యామిలీ సాయి ధరమ్ తేజ్ పెళ్లిని అధికారకంగా నిశ్చితార్థంతో ప్రకటించారు. నవంబర్ 5వ తేదీ సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం(Sai Dharam Tej Engagment) జరగబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి కానీ మెగా ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. తాజాగా సాయి తేజ్ నిశ్చితార్టానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కిరణ్మయితో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..

సాయి ధరమ్ తేజ్ తన ప్రేమించిన అమ్మాయి కిరణ్మయి(Kiranmayi) తో కలిసి ఏడు అడుగులు నడవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థపు వేడుకలో భాగంగా మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థం అనంతరం మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు. అయితే ఈ ఫోటోలో భాగంగా మెగా కజిన్స్ మాత్రమే ఉండటం విశేషం. అల్లు అర్జున్ బ్రదర్స్ అలాగే మెగా బ్రదర్స్ అందరూ కూడా ఈ నిశ్చితార్థపు వేడుకలో సందడి చేశారు.

జీవితాంతం సంతోషంగా ఉండండి..

Advertisement

ఇక ఈ నిశ్చితార్థపు ఫోటోలు సాయి తేజ్ అధికారికంగా తెలియచేయకపోయినప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సాయి ధరమ్ తేజ్ కిరణ్ కు అభినందనలు.. జీవితాంతం మీరిద్దరూ ఇలాగే ఎంతో ప్రేమతో, సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ ఈ కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

ఈ నిశ్చితార్థపు వేడుకకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సాయి ధరంతేజ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే వివరాలను తెలుసుకునే పనిలో అభిమానులు బిజీ అయ్యారు. ఇకపోతే ఇప్పటివరకు కిరణ్మయి ఫ్యామిలీకి సంబంధించిన వివరాలను ఎక్కడ వెల్లడించలేదని సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థపు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఫోటోలో భాగంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్(Akira Nandan), ఆద్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక పవన్ కళ్యాణ్ పిల్లలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ వేడుక జరిగినా ఖచ్చితంగా హాజరవుతూ సందడి చేస్తుంటారు. తాజాగా సాయి తేజ్ నిశ్చితార్థపు వేడుకలో భాగంగా అకీరా, ఆద్య పాల్గొన్నారు.

Also Read: మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్

Related News

మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్.. ఇదేం ట్విస్టు సీఎం సార్?

దొంగ నా కొడుకులో ఎమోషన్స్ ఉండవా? మౌళి చెప్పిన సమాధానం ఇదే!

రామాయణ యశ్ సింహాసనం కోసం 24 క్యారెట్ల బంగారం?ఎన్ని నెలల్లో తయారు చేశారో తెలుసా?

చల్లని సముద్రంలో మానస చౌదరి.. సూర్యాస్తమయం వేళ అందాల విందు!వీడియో వైరల్

నయన్ సారికకు మరో లక్కీ ఛాన్స్.. ఈసారి టిల్లు బాబుతో రొమాన్స్!

అందాల విందుతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మౌనీ రాయ్!

కొత్త నిర్మాతలు, దర్శకులకు ధీరజ్ వార్నింగ్.. ప్యాషన్ ఉంటే సినిమా ఇండస్ట్రీలోకి రావొద్దు!

Big Stories

Advertisement
×