Kotthapalli lo Okappudu Trailer:’కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలను నిర్మించిన రాణా దగ్గుపాటి (Rana daggubati) ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. టాలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. భారీ విజయాన్ని అందుకున్న కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా సత్తా చాటిన ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri) ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఇకపోతే గతంలో ఈ రెండు సినిమాలకు ప్రవీణ పరుచూరి రానాతో కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి వీరిద్దరి నిర్మాణంలో.. స్పిరిట్ మీడియా బ్యానర్ పై ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. జూలై 18వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ ఎలా ఉందంటే?
కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ ఓపెన్ అవ్వగానే.. ఊరి చివర ఉన్న ఒక అమ్మవారి విగ్రహం వద్దకు ఊరి ప్రజలంతా చేరుకుంటాడు. అక్కడ మంచంలో పడుకుని ఉన్న ఒక వ్యక్తిని హీరో చూపిస్తూ.. “ఇదిగోండి మేడం! ఈయన ఉన్నారే.. మంచం ఎక్కి 9 సంవత్సరాలు అవుతోంది. నడవలేడు.. నిలబడలేడు.. కానీ మా అత్తను తలుచుకుంటే రెండు నిమిషాల్లో పరిగెట్టేస్తాడు”. అంటూ డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. పూర్తిగా ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఈ గ్రామంలో వడ్డీ వ్యాపారం ఇచ్చే వ్యక్తి, జమీందారు, సావిత్రి అనే క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుందని, మనకు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది.. అంతేకాదు ట్రైలర్ చివర్లో ఒక సన్నివేశంతో సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. ఇలా తెలియని భయం ఏదో గ్రామస్తులను వెంటాడుతోందని.. దీన్ని చేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఇక దెయ్యం భయంతో వచ్చేది కాస్త రాలేదు.. రాలేంది కాస్త వచ్చేసిందండి అనే డైలాగుతో వీడియో ముగిస్తుంది. మొత్తానికి ఈ ట్రైలర్ అటు సినిమా ప్రేక్షకులకు మంచి ఆసక్తిని కలిగించేలా ఉంది అని చెప్పవచ్చు.
కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా నటీనటులు..
ఇక ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే.. మనోజ్ చంద్ర, ఉషా బోనే, మోనిక ఈ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్నారు. బెనర్జీ, వీంద్ర విజయ్, ర , బొంగు సత్తి , ప్రేమ్ సాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచబోతుందని స్పష్టం అవుతుంది.
also read:Betting App Promotion: కక్కుర్తి పడ్డారు.. తెలుగు హీరోలపై ఐపీఎస్ ఘాటు కామెంట్స్!