E-Paper
Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’ క్రేజీ అప్‌డేట్.. 100 రోజుల షూటింగ్ పూర్తి, రిలీజ్ ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’ క్రేజీ అప్‌డేట్.. 100 రోజుల షూటింగ్ పూర్తి, రిలీజ్ ఎప్పుడంటే?

Ranabali Update: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అనగానే ఒక రేంజ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయ్ .గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గీత గోవిందం’ (2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘గీత గోవిందం’ వంద కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు సృష్టిస్తే, ‘డియర్ కామ్రేడ్’ చిత్రం నార్త్ ఆడియన్స్‌కు సైతం ఈ జోడీని విపరీతంగా కనెక్ట్ చేసింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ క్రేజీ హిట్ పెయిర్ మళ్లీ జతకడుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఆ భారీ పాన్ ఇండియా  చిత్రమే ‘రణబాలి’.

 బ్రిటీష్ పాలనలో జరిగిన సంఘటనల ఆధారంగా 

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో సూపర్ హిట్ గా నిలిచిన ‘టాక్సీవాలా’ (2018) చిత్రానికి, అలాగే నేచురల్ స్టార్ నానితో పీరియాడిక్ డ్రామాగా వచ్చి క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘శ్యామ్ సింగరాయ్’ (2021) చిత్రానికి దర్శకత్వం వహించింది ఈ దర్శకుడే. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌ను, పీరియాడిక్ ఎమోషన్స్‌ను రాహుల్ చూపించిన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కూడా.ఇప్పుడు అదే నమ్మకంతో అంతకుమించిన భారీ క్యాన్వాస్‌తో ‘రణబాలి’ సినిమాను ప్లాన్ చేశారు .19వ శతాబ్దపు నేపథ్యంతో, 1854 నుండి 1878 మధ్య కాలంలో బ్రిటీష్ పాలనలో జరిగిన కొన్ని యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ కథను అద్భుతంగా మలిచారని ఇన్ సైడ్ టాక్.

 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సినిమా 

ఇలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ కథాంశాన్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. ‘పుష్ప ప్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్.. టీ సిరీస్ ప్రెసెంట్స్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అద్భుతమైన అప్‌డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రణబాలి’ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రాత్మక ప్రాంతమైన గండికోటలో ఒక కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు. వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య వచ్చే అత్యంత కీలకమైన, ఎమోషనల్ సీన్స్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌తో కలిపి ఇప్పటివరకు చిత్రానికి సంబంధించిన దాదాపు 90 శాతం షూటింగ్ శరవేగంగా పూర్తయిపోయింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చూసి మేకర్స్ ఫుల్ హ్యాపీగా, నమ్మకంగా ఉన్నారు.

సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సినిమా

ఇక ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా విడుదల చేసిన ‘రణబాలి’ ప్రత్యేక గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అందులోని యాక్షన్ సీక్వెన్సులు, విజయ్ దేవరకొండ రగ్గడ్ అండ్ పవర్‌ఫుల్ లుక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ‘అర్జున్ రెడ్డి’ (2017) తర్వాత విజయ్ లోని వైల్డ్ అండ్ ఇంటెన్స్ పర్‌ఫార్మెన్స్‌ను, అలాగే ‘యానిమల్’ (2023) సక్సెస్ తర్వాత రష్మిక మందన్న క్రేజ్‌ను ఈ చిత్రం వందకు వంద శాతం వాడుకోబోతున్నారని గ్లిమ్ప్స్ చూస్తేనే అర్థమవుతుంది. టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రణబాలి’ చిత్రాన్ని రాబోయే సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి ముచ్చటగా మూడో సారి జత కట్టిన ఈ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనాలకి తెరతీస్తుందో !

also read :రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో ఆ సీన్స్ డిలీట్.. బుచ్చిబాబు షాకింగ్ డెసిషన్!

Related News

ఆ లవ్ అఫైర్స్ నాకొద్దు అంటున్న క్రేజీ హీరోయిన్…ఆ ఆలోచనే లేదంటూ క్లియర్ కట్ వార్నింగ్!

‘పెద్ది’ వివాదంపై అనసూయ భరద్వాజ్ సెన్సేషన్ కామెంట్స్…. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో ఆ సీన్స్ డిలీట్.. బుచ్చిబాబు షాకింగ్ డెసిషన్!

రామ్‌చరణ్ ఊచకోత.. 48 గంటల్లోనే రూ. 181 కోట్లు. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!

బడ్జెట్ తక్కువ సినిమాలు.. బ్లాక్ బాస్టర్ రిజల్ట్..!

యానిమల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అయ్యో అంత బాధపడిందా..?

రూ. 4000 కోట్లా? అంత సీన్ లేదు..‘రామాయణ’, ‘వారణాసి’లపై మనోజ్ భాజ్‌పేయి సెన్సేషన్ కామెంట్స్

Big Stories

×