Road Accident: హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రోజుకు సగటున మూడు నుంచి నాలుగు రోడ్డ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరణాలు కూడా నమోదవుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 75% ప్రమాదాలు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయి. బంజారాహిల్స్, ఆరాంఘర్ వంతెన వంటి ప్రాంతాల్లో తీవ్ర ప్రమాదాలు జరిగాయి. రోడ్డు నిర్మాణ లోపాలు, మూలమలుపుల వద్ద అతివేగం కూడా ప్రమాదాలకు కారణం. పోలీసులు కౌన్సెలింగ్, జరిమానాలు విధిస్తున్నప్పటికీ కొందరు ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
ALSO READ: Railway Tunnel: దేశంలోనే అతి పొడవైన రైల్వే టన్నెల్, అమ్మో అన్ని కిలోమీటర్లా?
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మియాపూర్ పరిధిలోని గోపాల్ నగర్ లో బస్సు వేగంగా వచ్చి బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బైక్ టర్నింగ్ వద్ద ఆగకుండా వచ్చేసరికి అటుగా వెళ్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి స్పాట్ లోనే మృతిచెందాడు. ఈ సంఘటన దృశ్యాలు అక్కడే ఉన్న కారులోని డాష్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ALSO READ: Watch Video: రీల్స్ కోసం రిస్క్, పడితే ప్రాణాలు పోతాయ్ రా అయ్యా!
మృతుడిని క్యాలిసియం హాస్పిటల్ లోని ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వేగంగా దూసుకొచ్చి వ్యక్తిని ఢీకొన్న బస్సు.. VIDEO
హైదరాబాద్-మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌నగర్‌లో ఘటన
గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన నాగరాజ్ అనే వ్యక్తి
క్యాలిసియం హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న నాగరాజ్… pic.twitter.com/kWTEScrJdA
— BIG TV Breaking News (@bigtvtelugu) August 1, 2025