BigTV English

OG First Single: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు షాకింగ్ న్యూస్.. లీకైన ఓజీ ఫస్ట్ సింగిల్!

OG First Single: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు షాకింగ్ న్యూస్.. లీకైన ఓజీ ఫస్ట్ సింగిల్!

OG First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “ఓజీ”(OG). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు మరి కాస్త సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటినుంచి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఓజీ ఫస్ట్ సింగిల్ విడుదల…

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఆగస్టు 2 వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా చిత్ర బృందం వెల్లడించారు దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాట సోషల్ మీడియాలో లీక్ అయ్యిందని తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్(SSThaman) దర్శకుడు సుజిత్ కు చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు ఒకింత షాక్ కి గురైనా తర్వాత ఇది ప్రాంక్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.


ప్రాంక్ కాల్ తో భయపెట్టిన తమన్..

ఇటీవల కాలంలో సినిమాలను విభిన్న రీతిలో ప్రమోట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ సుజిత్ కు ప్రాంక్ కాల్ చేస్తూ మనం విడుదల చేయాలనుకున్న పస్ట్ సింగిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యిందని చెప్పడంతో అటువైపు నుంచి సుజీత్ అవునా ఎవరు ఈ పని చేసి ఉంటారు.. మన టీంలో వాళ్లే చేసి ఉంటారని చెప్పడంతో లేదు వాట్సప్ షేర్ చేశారు అంటూ తమన్ టెన్షన్ పడుతూ మాట్లాడగా అటువైపు నుంచి సుజిత్ మాత్రం చాలా ప్రశాంతంగా మాట్లాడారు. అయితే చివరికి తమన్ సస్పెన్స్ తట్టుకోలేక ప్రాంక్ అని చెప్పేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి లీక్స్ అధికమవుతున్న నేపథ్యంలో తమన్ కూడా ఫ్రాంక్ చేశారని స్పష్టమవుతుంది.మూవీలో పవన్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా కనిపించనుండగా, విలన్ పాత్రల్లో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పస్ట్ సింగల్ ఆగస్టు 2 వ తేదీ విడుదల కానుంది. ఇటీవల పవన్ నటించిన హరిహర వీరమల్లు ప్రేక్షకులకు కాస్త నిరాశ కలిగించిన ఈ సినిమాపై మాత్రం భారీ స్థాయిలో అంచనాలను పెట్టుకుని ఉన్నారని చెప్పాలి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Bigg Boss Siri:  పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతం.. బిగ్ బాస్ సిరిని తిట్టిపోస్తున్న జనం

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×