E-Paper
Advertisement

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Rasha Thadani:బాలీవుడ్ స్టార్ కిడ్ రాషా తడానీ (Rasha Thadani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ (Jayakrishna ) తొలి పరిచయంలో ఇండస్ట్రీకి పరిచయం అవుతూ వచ్చిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి పరిచయంతోనే తన అద్భుతమైన నటనతో, గ్లామర్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే తాజాగా ఆమె మరో రొమాంటిక్ యాక్షన్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పైగా ఈ సినిమా విడుదల తేదీ కూడా లాక్ చేయడం గమనార్హం.

జోరు పెంచిన రాషా తడానీ.. కొత్త మూవీ రిలీజ్ డేట్ లాక్..

ఆజాద్ అనే సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఇప్పుడు ‘లైకీ లైకా’ అనే ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా షూటింగు ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ రీ షూట్ కారణంగా పలుమార్లు వార్తల్లో నిలిచింది. ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ ఏకంగా విడుదల తేదీని ఖరారు చేసినట్లు సమాచారం.

Advertisement

also read:శోభాశెట్టి ప్రేమను యశ్వంత్ అంత ఈజీగా ఒప్పుకోలేదా.. ఎన్నో నిజాలు బయటపెట్టిన బ్యూటీ!

విడుదల తేదీ ఎప్పుడంటే?

సౌరబ్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫాంటమ్స్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇందులో ముంజ్య ఫేమ్ అభయ్ వర్మ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా 2027 ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్ లలోకి తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం నిర్ణయించింది. మొత్తానికైతే ప్రేమ కథకు యాక్షన్ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రేమ.. నొప్పి.. నమ్మకం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా రొమాంటిక్ సినిమాలకు చాలా భిన్నంగా ఉండబోతుందని, ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అర్థమవుతుంది.

అందుకే వాయిదా..

Advertisement

ఇకపోతే ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారట. కానీ కొన్ని సన్నివేశాల ఔట్పుట్ కి మేకర్స్ సంతృప్తి చెందకపోవడం.. పైగా ప్రమోషన్స్ కి సరైన సమయం లేకపోవడం వల్లే సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇంకా విడుదలకు చాలా సమయం ఉంది. కాబట్టి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీషూట్ చేయడానికి డైరెక్టర్ నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం రీ షెడ్యూల్ సుమారుగా 20 రోజులపాటు కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అభయ్ వర్మ, రాషా ఇద్దరు గాయాలతో రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. మొత్తానికైతే ప్రేమ కోసం వీరిద్దరూ పెద్ద యుద్ధమే చేశారన్నట్టుగా ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. మరి ఆగిపోయి మళ్లీ విడుదలకు నోచుకుంటున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×