E-Paper
Advertisement

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!
Advertisement

Fire-Boltt Hurricane smartwatch: స్మార్ట్‌ వాచ్‌లంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన రోజులు ఎప్పుడో పోయాయి! ఇప్పుడు మన బడ్జెట్‌లోనే అదిరిపోయే ఫీచర్లతో కూడిన గాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో.. ప్రీమియం లుక్ కోరుకునే యూత్ కోసం ప్రముఖ బ్రాండ్ ఫైర్-బోల్ట్ ‘హరికేన్’ స్మార్ట్‌ వాచ్‌ను సరి కొత్త హంగులతో తీసుకొచ్చింది. కేవలం రూ.1,299 పాకెట్ ఫ్రెండ్లీ ధరకే లభిస్తున్న ఈ వాచ్‌లో 1.3 ఇంచుల కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ , వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో.. ఆల్-ఇన్-ఒన్ గ్యాజెట్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

మార్కెట్లో రోజురోజుకు స్మార్ట్‌వాచ్‌ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. చేతికి ఒక స్టైలిష్ వాచ్ ఉంటే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. అయితే.. ఎక్కువ ధర పెట్టి కొనలేని వారి కోసం బ్రాండెడ్ కంపెనీలు ఇప్పుడు అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్‌లను అందిస్తున్నాయి. ఈ కోవకే చెందిన ‘ఫైర్-బోల్ట్ హరికేన్’ స్మార్ట్‌ వాచ్ టెక్కీలను, కాలేజీ కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేవలం రూ. 1,299 ధర కేటగిరీలో ఇది ఇస్తున్న ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.

ఫీచర్లు:

1.కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లేతో సూపర్ లుక్:

Advertisement

ఈ వాచ్ డిజైన్ చూడ్డానికి చాలా రిచ్‌గా, ప్రీమియంగా ఉంటుంది. ఇందులో.. 1.3 అంగుళాల సైజు కలిగిన కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లేను అందించారు. సిల్వర్ గ్రే స్ట్రాప్, ఫ్రీ సైజ్ డిజైన్‌తో వస్తున్న ఈ వాచ్ చేతికి చాలా స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. సాధారణ ఫ్లాట్ స్క్రీన్లతో పోలిస్తే.. ఈ కర్వ్‌డ్ డిస్‌ప్లే వాచ్‌కి ఒక మోడర్న్ అందాన్ని తెచ్చిపెట్టింది. ఎండలో.. బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, బ్రైట్‌గా కనిపిస్తుంది.

2.ఫోన్ తీయకుండానే బ్లూటూత్ కాలింగ్ మజా:

ఈ బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ లభించడం నిజంగా విశేషం. ఫైర్-బోల్ట్ హరికేన్ వాచ్ ద్వారా మీరు మీ ఫోన్‌ను జేబులో నుంచి తీయకుండానే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ ఉండటం వల్ల కమ్యూనికేషన్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆఫీసు పనుల్లో.. బిజీగా ఉన్నప్పుడు, బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ కస్టమర్లకు ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది.

3.ఫిట్‌నెస్,హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు:

Advertisement

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే.. ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కోసం ..ఈ వాచ్‌లో వందకు పైగా (100+) స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా వంటి వ్యాయామాలను ఇది పక్కాగా ట్రాక్ చేస్తుంది. అలాగే.. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు, నిద్రను విశ్లేషించే స్లీప్ ట్రాకర్ వంటి ఆరోగ్య సంబంధిత ఫీచర్లు ఇందులో.. సక్రమంగా పని చేస్తాయి. మన రోజువారీ ఫిట్‌నెస్ గోల్స్‌ను చేరుకోవడానికి ఇది చక్కగా సహాయ పడుతుంది.

Also Read: ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

4. బ్యాటరీ లైఫ్:

ఒకసా రి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ వాచ్ సాధారణ వాడకంలో రోజంతా పనిచేస్తుంది. రోజువారీ నోటిఫికేషన్‌లు, సోషల్ మీడియా అలర్ట్‌లు అన్నీ గడియారం స్క్రీన్ పైనే.. క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండటం వల్ల చిన్నపాటి నీటి చుక్కలు లేదా చెమట తగిలినా వాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

5. ధర:

ఇన్ని లేటెస్ట్ హంగులతో వస్తున్న ఈ ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌ వాచ్ ధర మార్కెట్లో కేవలం రూ.1,299 మాత్రమే. బడ్జెట్ తక్కువగా ఉండి, అన్ని మోడర్న్ ఫీచర్లు ఉన్న బ్రాండెడ్ స్మార్ట్‌ వాచ్ కొనాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే గుండె ఆగిపోతుంది!

Vivo X500 Pro Max వచ్చేస్తోంది.. 200MP కెమెరా, భారీ డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!

Big Stories

Advertisement
×