Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఏమాత్రం తీరిక లేకుండా కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల కాబోతుంది అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇక తాజాగా మరొక సినిమా పూజ కార్యక్రమాలను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక “మైసా”(Mysaa) అనే సినిమా పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
లేడీ ఓరియంటెడ్ సినిమా…
ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇదివరకే రష్మికకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్ విడుదల చేయడంతో సినిమా పట్ల మంచి అభిప్రాయమే ఏర్పడింది. ఇక తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగడంతో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా రష్మిక సాంప్రదాయపద్ధంగా చీర కట్టుకొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గోండు పాటకు నృత్యం..
ఈ సినిమా పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా కొంతమంది గిరిజన మహిళలు కూడా పాల్గొన్నారు. ఇక రష్మిక ఈ గిరిజన మహిళలతో కలిసి గోండు పాటకు డాన్స్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై విభిన్న రకాలుగా అభిమానులు స్పందిస్తున్నారు. గిరిజన సంఘాలు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదం సృష్టిస్తుండగా రష్మికతో కలిసి గిరిజన మహిళలు మాత్రం డాన్స్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక నిన్న తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటామని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా గో బ్యాక్ విజయ్ దేవరకొండ అంటూ నిరసనలు కూడా తెలియజేశారు.
?igsh=Z3F5bWYwMjZodHZj
విజయ్ దేవరకొండ రెట్రో సినిమా(Retro Movie) వేడుకలలో భాగంగా ఆపరేషన్ సిందూర్ గురించి పహల్గాం దాడి గురించి మాట్లాడుతూ.. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు అలా కొట్టుకునే వారు అంటూ మాట్లాడారు. ఇలా గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చి విజయ్ దేవరకొండ మాట్లాడారు అంటూ గిరిజన సంఘాలు ఈయనపై కేసులు పెట్టడం, ఈయన సినిమాలను అడ్డుకుంటాం అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ గిరిజనులతో వివాదంలో నిలవగా, రష్మిక మాత్రం డాన్సులు చేస్తున్న నేపథ్యంలో ఈ వీడియో కాస్త వైరల్ అవుతూ చర్చలకు కారణమైంది.