Fauji Film: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్(Prabhas) బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో ప్రభాస్ కు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించడమే కాకుండా, అప్పటి నుంచి ఈయన వరుస సినిమాలను పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా(Fauji) షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.
50% పూర్తి అయిన ఫౌజీ…
డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ ఇమాన్వి (Imanvi)హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా 1940 లనాటి యుద్ధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇది స్వాతంత్రం రాకముందు, భారతదేశానికి సంబంధించిన కథ అని, ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఏప్రిల్ టార్గెట్ చేసిన హను రాఘవపూడి..
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే హను రాఘవపూడి ఈ సినిమా షూటింగ్ పనులను పరిగెత్తిస్తున్నారు. ఇలా ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిన అభిమానులు ఏంటి డార్లింగ్ ఈ స్పీడ్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఈయన నటించిన ది రాజా సాబ్ షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
ప్రభాస్ అద్భుతమైన ప్లానింగ్…
ఇకపోతే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాగా ప్రభాస్ అక్టోబర్ చివరిన లేదా నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాతో పాటు కల్కి 2, సలార్ 2 సినిమా షూటింగ్స్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ నాటికి షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటే వచ్చే ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇకపోతే ప్రభాస్ సినిమాల విషయంలో అద్భుతమైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. అందరి హీరోల మాదిరి కాకుండా ఈయన ప్రతి ఏడాది తన సినిమా విడుదల అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ ఏడాది ది రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: Star Actress: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి.. విలువైన బహుమతి అంటూ పోస్ట్!