Rashmika Mandanna: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఉదయ్ పూర్ లో వీరి వివాహ మహోత్సవం అత్యంత సన్నిహితులు, సెలబ్రిటీల, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా పెళ్లి వేడుక పూర్తి కావడంతో ఈ జంట హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారని తెలుస్తోంది.
పెళ్లి అయిన వెంటనే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా రష్మిక మందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కుటుంబాన్ని కలిశారు. ఈమె మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా రష్మిక మందన్న పెళ్లి తర్వాత రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి(Geetha Reddy) రష్మిక మందన్నకు సాంప్రదాయబద్ధంగా చీరసారేతో సత్కరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇలా ఈ వెడ్డింగ్ రిసెప్షన్(Wedding Reception) లో భాగంగా రాజకీయ నాయకులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమం తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4వ తేదీ జరగబోతోంది. ప్రస్తుతం ఈ జంట రిసెప్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత విజయ్ రష్మిక దేశవ్యాప్తంగా పలు ఆలయాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా తమ పెళ్లి వేడుకను అందరితో సెలబ్రేట్ చేసుకోవడం కోసమే ఈ దంపతులు ఆలయాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వీట్స్ పంపిణీ చేశారని తెలుస్తోంది.
విజయ రష్మిక రణబాలి..
రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించిన ఈ జంట ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట మరోసారి వెండితెరపై జంటగా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వీరిద్దరూ రణబాలి(Ranabaali) అనే సినిమాలో నటించబోతున్నారు. వీరి పెళ్లి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏందయ్యా స్వామి అనే పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also Read: Big Tv Kissik Talks: తనూజ బిగ్ బాస్ జర్నీ పై హారిత కామెంట్స్…ఆ కన్నీళ్ల కష్టం మీకేం తెలుసు?