Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా (Tamannaah Bhatia) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మేని ఛాయతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతోమంది స్టార్ హీరోలకు ఫేవరెట్ హీరోయిన్ కూడా.. అంతేకాదు ఈమెతో హీరోలు సినిమాలలో నటిస్తున్నారు అంటే వారి భార్యలు కూడా భయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతలా తన అందంతో అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా అసూయ పడేలా చేసింది తమన్నా.. అంతటి పేరు సొంతం చేసుకున్న ఈమె వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. అసలు రూమర్స్ కి చోటు ఇవ్వకుండా.. తన పని తాను చేసుకుంటూ పోయే తమన్న అనుకోకుండా విజయ్ వర్మ (Vijay Varma) తో ప్రేమలో పడింది. రెండేళ్లు డేటింగ్ చేసుకున్న వీరు ఇటీవల విడిపోయారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనిలో ఏ క్వాలిటీస్ ఉండాలి? అనే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చింది. ఇక ఈ క్వాలిటీస్ విన్న నెటిజన్స్ కూడా అందుకే విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పుకున్నావా? మరి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరుకుతాడని ఆశిస్తున్నావా? అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి తనకు కాబోయే భర్తపై ఎలాంటి ఆశలు పెట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
అలాంటి వ్యక్తి కావాలంటున్న తమన్నా..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.. “కచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఎవరిని చేసుకుంటాను అనేది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను పెళ్లి చేసుకుంటే మాత్రం తమన్నా లాంటి భార్య దొరికినందుకు గత జన్మలో ఏదో పుణ్యం చేసి ఉండాలి అని అతను అనుకోవాలి. అంతలా అతన్ని ప్రేమగా చూసుకుంటాను. అతను కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకోవాలి. అలా చూసుకుంటాడు అనిపించిన వెంటనే అదే వ్యక్తిని ఏమాత్రం లేట్ చేయకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ కూడా అదే ఆలోచనలో ఉన్నాను. ఇక పెళ్లి చేసుకోవడానికి ఏజ్ తో సంబంధం లేదు” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. మొత్తానికైతే తమన్నాను ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మొత్తానికైతే విజయ్ వర్మ నుండి తనకు ఆ ప్రేమ దొరకలేదు కాబట్టే ఆమె బ్రేకప్ చెప్పుకుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తమన్నా మాత్రం ఇలా పెళ్లిపై, కాబోయే భర్తపై కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తమన్నా సినిమాలు..
ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమెకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే వెబ్ సిరీస్ ల బాట పట్టిన ఈమె అప్పుడప్పుడు పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరియర్ ను కొనసాగిస్తోంది. మూడు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతోనే ఇప్పుడు రోజుకొక వార్త వైరల్ గా మారుతోంది. మరి తమన్న కోరుకున్నట్లు ఆ వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడో చూడాలి.