Rashmika Mandanna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొన్ని హాట్ టాపిక్స్ లో విజయ్ దేవరకొండ,రష్మిక రిలేషన్ ఒకటి. వీరిద్దరి మధ్య ఎంతో పెద్ద కథ నడుస్తున్న కూడా ఏమీ లేనట్లు ఉంటూనే ఉంటారు. చాలాసార్లు వీరిద్దరూ కలిసి ఎయిర్పోర్టులో కనిపించిన వీడియోలు వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఒకే లొకేషన్ లో వీరిద్దరూ వేర్వేరుగా దిగిన ఫోటోలు కూడా చాలా ఉన్నాయి.
ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని విషయం పైన అందరికీ క్లారిటీ వచ్చేసింది. కాకపోతే దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వీరిద్దరికి గీతగోవిందం సినిమాతో పరిచయం ఏర్పడింది. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
నమ్మలేకపోతున్నా
విజయ్ అంటే రష్మికకు విపరీతమైన ఇష్టం. విజయ్ కింగ్డమ్ సినిమా చూడటానికి భ్రమరాంబ థియేటర్కు మారువేషంలో వెళ్ళింది రష్మిక. దీనిని బట్టి విజయ్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అయితే నేటికీ గీతగోవిందం సినిమా వచ్చి ఏడు సంవత్సరాలు అయింది. ఈ తరుణంలో ఆ సినిమాలోని కొన్ని ఫొటోస్ షేర్ చేసింది రష్మిక. అప్పుడే ఏడు సంవత్సరాలు అయిపోయింది అంటే నమ్మలేకపోతున్నాను. గీత గోవిందం సినిమా నాకు ఎప్పటికీ ఒక ప్రత్యేకం. అంటూ ఫొటోస్ తో పాటు రాసుకు వచ్చింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా డియర్ కామ్రేడ్. బాక్సాఫీస్ వద్ద డియర్ కామ్రేడ్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఇప్పటికీ ఆ సినిమాకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
విజయ్ కు అదే చివరి హిట్
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో మంచి స్టార్ట్ డౌన్స్ సాధించుకున్నాడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా తర్వాత గీతగోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. గీత గోవిందం సినిమా వచ్చి నేటికీ ఏడు సంవత్సరాలు అవుతుంది. ఆ రేంజ్ హిట్ సినిమా మళ్లీ విజయ్ దేవరకొండ కెరియర్ లో పడలేదు. రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ సినిమా కూడా అంతంత మాత్రమే ఒక ప్రస్తుతం మాత్రం విజయ్ దేవరకొండ కెరియర్ లో మంచి లైనప్ సెట్ చేశాడు. తర్వాత చేయబోయే రెండు సినిమాలు మీద కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Madharaasi : మదరాసి సినిమా కథ చెప్పేసిన మురగదాస్, ఏకంగా గజినీ రేంజ్