OTT Movie : రొమాంటిక్ సినిమాలను యూత్ ఎక్కువగా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఓటీటీలో ఇలాంటి సినిమాలకు కొదవలేదు. ఎలాంటి కంటెంట్ కావాలన్నా ఒక్క క్లిక్ తో దొరుకుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రొమాంటిక్ జానర్ లో వచ్చినప్పటికీ స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో నవదీప్ ప్రాధాన పాత్రలో నటించాడు. ఇది నవదీప్ కి కమ్‌బ్యాక్ సినిమాగా ప్రచారం కూడా జరిగింది. మేఘాలయ లొకేషన్ల విజువల్ అందం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెట్టాయి. రొమాంటిక్ డ్రామాలు, ఫాంటసీ కథలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఒక మంచి ఎంపిక. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ?అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
మౌళి (నవదీప్) ఒక ప్రసిద్ధ చిత్రకారుడు. ప్రేమపై నమ్మకం కోల్పోయి, ఒంటరిగా జీవిస్తుంటాడు. అతను సమాజం నుండి దూరంగా, ప్రకృతి మధ్యలో తన కళ ద్వారా తన భావాలను వ్యక్తపరుస్తుంటాడు. తన తల్లిదండ్రులు విడిచిపెట్టడం, తాత మరణంతో నిరాశలో ఉన్న మౌళి, తన మేనేజర్ హరిక (భావన సాగి) సహాయంతో తన చిత్రాలను అమ్ముకుంటాడు. ఒక రోజు అతను మేఘాలయలోని అడవుల్లో ఒక అఘోరాను (రాణా దగ్గుబాటి) కలుస్తాడు. ఆ అఘోరా అతనికి ఒక మాయా కుంచెను ఇస్తాడు. ఈ కుంచెతో మౌళి తన కలల అమ్మాయి చిత్రాన్ని (పంఖురి గిడ్వానీ) చిత్రీకరిస్తాడు. ఆశ్చర్యంగా ఆ చిత్రంలో ఉన్న అమ్మాయి ప్రాణాలతో బయటికి వస్తుంది. ఇక ఆ షాక్ నుంచి తేరుకుని, ఆ అమ్మాయికి చిత్ర అనే పేరు పెడతాడు.
Read Also : ప్రెగ్నెంట్ లేడీసే టార్గెట్… బుర్ర బద్దలయ్యే ట్విస్టులున్న మిస్టీరియస్ బాక్స్… క్లైమాక్స్ హైలెట్
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్
‘లవ్ మౌళి’ (Love Mouli) ఒక ఆధునిక తెలుగు రొమాంటిక్ సినిమా. అవనీంద్ర దీనికి దర్శకత్వం వహించారు. అందులో నవదీప్, పంఖురి గిడ్వానీ, రాణా దగ్గుబాటి, భావన సాగి, చార్వి దత్త, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 26 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.5/10 రేటింగ్ ను సాధించింది. ఈ చిత్రం 2024 జూన్ 7న థియేటర్లలో విడుదలై, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 2024 జూన్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.