Madharaasi : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు మురగదాస్. మురగదాస్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఇప్పుడు కాస్త ఆదరణ తగ్గింది కానీ ఒకప్పుడు మురగదాస్ సినిమా అంటే విపరీతమైన అంచనాలు ఉండేవి.
వివి వినాయక దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఒరిజినల్ కథను రాసింది మురగదాస్. రమణ అనే పేరుతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అదే సినిమాను ఠాగూర్ పేరుతో చిరంజీవి చేశారు. ఇక గజినీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మురగదాస్ అంటే మొదటి గుర్తొచ్చే సినిమా పేరే గజిని.
మదరాసి సినిమా కథ
ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకుడిగా మదరాసి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు ఏఆర్ మురగదాస్. ఆ ఇంటర్వ్యూలో మదరాసి సినిమాకు సంబంధించి కథ పాయింట్ రివీల్ చేశాడు. ఈ సినిమా ఒక లవ్ స్టోరీ. అలానే దీనితో పాటు, యాక్షన్ కూడా ఉంటుంది. గజిని సినిమాలో రివేంజ్ స్టోరీ లవ్ ద్వారా ఎలా చెప్పామో ఈ సినిమా దాదాపు అలానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాను గజినీ సినిమాతో పోల్చేసరికి అంచనాలు ఇంకొంచెం రెట్టింపు అవుతున్నాయి.
సూపర్ సక్సెస్ తర్వాత
శివ కార్తికేయన్ జర్నీ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు అనేది చాలామందికి ఇన్స్పిరేషన్. ఇక తెలుగులో కూడా డైరెక్టర్ అనుదీప్ తో ప్రిన్స్ అనే సినిమా చేశాడు. అయితే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను బాగానే ఆదరించారు. కానీ తమిళ ప్రేక్షకులకు ఆ సినిమా ఎక్కలేదు. ఇక రీసెంట్గా అమరన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు శివ. సక్సెస్ఫుల్ అమరన్ సినిమా తర్వాత వస్తున్న మదరాసి చిత్రం పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Coolie: కూలీ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ రావడం వెనక కారణం ఇదే