Tirumala News: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. రెండు నెలలకు ముందుగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నకానున్నారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఓ ప్రకటన చేశారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించారు టీటీడీ అదనపు ఈవో. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు అనుకున్న సమయం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా అధికారులు చేయాల్సిన పనులపైదిశానిర్దేశం చేశారు.
బ్రహ్మోత్సవ సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. ప్రొటోకాల్ ఉన్నవారికి మాత్రమే దర్శనం విషయం లో మినహాయింపు ఇచ్చింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతల కోటాలో దర్శనాలకు ఎలాంటి అనుమతి ఉండదు.
దర్శన క్యూ లైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు ఉంటాయి. ముఖ్యమైన ప్రాంతాలలో అన్నప్రసాదాల పంపిణీ ఉంటుంది. శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించింది. సెప్టెంబర్ 28న గరుడ వాహన సేవ నేపథ్యంలో 27 నుంచి 29 వరకు తిరుమల ఘాట్ రోడ్లలో టూ వీలర్స్‌కు అనుమతి నిరాకరించారు.
ALSO READ: పార్టీలో ఉంటూ చాప కింద నీరులా.. అడ్డంగా బుక్కైన రామారావు
బ్రహ్మోత్సవాలకు ముందు సెప్టెంబరు 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. సెప్టెంబరు 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 24 న ధ్వజారోహణం కార్యక్రమం ఉంటుంది. అక్టోబరు ఒకటిన రథోత్సవం, 2న చక్రస్నానం ఉండనుంది.
బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహన సేవ ఉంటుంది. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు అందుబాటులో ఉండనున్నాయి. తిరుమల అంటతా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్ మ్యాప్, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేందుకు విద్యుత్ అలంకరణలు, ఫల-పుష్ప ప్రదర్శన ఉండనున్నాయి. భక్తుల రద్దీకి తగిన విధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలన్నది ప్రధానమైన పాయింట్.