Illu Illalu Pillalu Today Episode july 11 th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా బాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అక్కడ గేటు చూస్తే తాళం వేసి ఉంటుంది.. ఆ పక్కనే ఒక పేపర్లో ఇంటిని అద్దెకి ఇవ్వబడును అని నెంబర్ రాసి ఉంటుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్నీ తెలుసుకుంటుంది నర్మదా. భాగ్యం వాళ్లది అసలు ఇల్లు ఇది కాదని ఈ విషయాన్ని వల్లి అక్క తోనే కన్ఫామ్ చేసుకోవాలని అనుకుంటారు.. ఇక వెంటనే వేదవతి కి ఫోన్ చేసి నర్మదా వల్లి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కోమని అడుగుతుంది. శ్రీవల్లి దగ్గరికి వెళ్లి మీ అమ్మ వాళ్లు ఇంట్లోనే ఉన్నారా అమ్మ అని అడుగుతుంది.. శ్రీవల్లి మొదట ఇంట్లోనే ఉన్నారండి అని అంటుంది.
ఆ విషయం నీ వేదవతి నర్మదా వాళ్లకు చెప్పడం విని షాక్ అవుతుంది శ్రీ వల్లి. ఒకసారి స్పీకర్ ఆన్ చేసి వల్లి అక్క దగ్గరికి ఇవ్వరా అని నర్మదా ప్రేమ అంటారు.. మా అమ్మ వాళ్లు లేరు అనగానే సరే మేము వెనక్కి వచ్చేస్తాం లేని నర్మద, ప్రేమ అంటారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను మన బండారం మొత్తం బయటపడేలా ఉంది అని టెన్షన్ పడుతూ భాగ్యంకు ఈ విషయం ఫోన్ చేసి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మద, ప్రేమ మాత్రం భాగ్యం వాళ్ళ కోసం వేట మొదలు పెడతారు. ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉంటారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమకు డాన్స్ క్లాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక నేను అర్జెంటు వెళ్లాలి సాయంత్రం వెతుకుదాం అని ప్రేమా నర్మద ఇద్దరు వెళ్ళిపోతారు. ఆటో కోసం చూస్తుంటే వెనకాల వచ్చిన ధీరజ్ నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను పద అని అంటాడు. కానీ ధీరజ్ సైకిల్ లో వెళ్తే తను డాన్స్ క్లాస్ చెప్తున్నా విషయం తెలిసిపోతుందని ప్రేమ టెన్షన్ పడుతుంది.. ధీరజ్ నుంచి తప్పించుకుని ప్రేమ బయటపడుతుంది.. కానీ ధీరజ్ మాత్రం ప్రేమపై అనుమానం రావడంతో వెనకాలే వస్తాడు.. ప్రేమ ధీరజ్ రావడం గమనించి దాక్కుంటుంది..
ధీరజ్ వెళ్ళిపోయాడని కన్ఫామ్ చేసుకొని ప్రేమ డాన్స్ క్లాస్ కి వెళ్తుంది.. రామరాజు ధీరజ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.. వాడికి ఎందుకురా ఈ కర్మ అందరూ ఉన్నా కూడా వాడు అలా డెలివరీలు చేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని బాధపడుతూ ఉంటాడు. అయితే ధీరజ్ తిన్నాడో లేదో అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉన్నా రామరాజు దగ్గరికి తిరుపతి వెళ్తాడు. ఏంటి బావ నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావా.. వాడు ఫుడ్ డెలివరీ అని తిన్నాడో లేదో అని ఆలోచిస్తున్నాను రా అని అంటాడు. వెంటనే ధీరజ్ రావడం గమనించిన తిరుపతి ఆ మాట నువ్వే వాడిని అడుగు బావా వస్తున్నాడు అని అంటాడు.
ధీరజ్ లోపలికి రాగానే రామరాజు ఇష్టం లేనట్టు మాట్లాడుతాడు.. నాన్న నేను ఈ నెల డెలివరీలు బాగా చేశాను. అనుకున్న దాని కంటే ముందుగానే డెలివరీ చేసినందుకు నాకు చాలామంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. దానివల్ల నాకు ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు అని ధీరజ్ అంటాడు. దాంతోనే మీకు ఈ షర్టు తీసుకొచ్చానా ఇది వేసుకుంటే మీరు కింగ్ లాగా ఉంటారు అని షర్టు చేతికి ఇస్తాడు. షర్ట్ ని తీసుకున్న రామరాజు తర్వాత దాన్ని దూరంగా విసిరేస్తాడు..
Also Read : భర్తకు సేవలు చేస్తున్న అవని..పార్వతిని ఆడుకున్న రాజేంద్ర ప్రసాద్..
నువ్వు నా కష్టాన్ని అర్థం చేసుకొని నన్ను జీవితంలో పైకి ఎదిగేలా చేస్తావని షర్టు తీసుకొచ్చాను నాన్న.. ఇది నువ్వు వేసుకుంటే నన్ను అభినందించావని సంతోషపడతానని ధీరజ్ అంటాడు. ఇక రామరాజు తిరుపతి చెప్పిన మాటల్ని సీరియస్గా తీసుకొని ధీరజ్ తెచ్చిన షర్టుని వేసుకుని బయటికి వస్తాడు. అటు ప్రేమ డాన్స్ క్లాసులు చెప్తూ సేన కంట పడుతుంది. ఏం చేస్తున్నావ్ అమ్మ అని సేన అంటాడు. ఇదంతా నిన్ను కాదు ఆ రామరాజు గాన్ని అనాలి. కోడలు సంపాదనతో పూట గడుపుకుంటున్నాడా వాడుకుంటుంది చూడు నా చేతిలో అని సేన వెళ్ళిపోతాడు. ధీరజు వాళ్ళ నాన్న షర్టు వేసుకోలేదని బాధపడుతూ ఉంటాడు.. ఎదురుగా వాళ్ళ నాన్న షర్టు వేసుకొని కనిపించడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…