Shruti Haasan:శృతిహాసన్ (Shruti haasan).. దిగ్గజ సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ (Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిజానికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు సింగర్ గా మారి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తాను నటించిన సినిమాలలో కూడా పాటలు పాడి, తన టాలెంట్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. 2000 సంవత్సరంలో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన ‘హే రామ్’ అనే సినిమాతో బాలనటిగా కెరియర్ ను ఆరంభించి.. 2008లో ‘సోహం షా’ దర్శకత్వంలో వచ్చిన ‘లక్’ అనే సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తెలుగులో 2011లో కే రాఘవేంద్రరావు కొడుకు కే ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచినా .. శృతిహాసన్ కి మాత్రం ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు లభించింది.
పెళ్లిపై అలాంటి కామెంట్లు చేసిన శృతిహాసన్..
ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్న శృతిహాసన్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో కూడా భాగం అవుతూ అందరిని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా ఈమె రజినీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేపథ్యంలో.. వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్న శృతిహాసన్.. తన పెళ్లి పై ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ ఘటన నన్ను శిలలా మార్చేసింది – శృతిహాసన్
పెళ్లిపై శృతిహాసన్ మాట్లాడుతూ.. “వివాహానికి అవసరమైన నిబద్ధత, విధేయతలను నేను నమ్ముతున్నాను. కానీ వివాహం అనే ఆలోచన నన్ను ఒక శిలలా మారుస్తోంది. గతంలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ అది ఫలించలేదు. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాను. ఏకాంతంలో హాయిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను” అంటూ శృతిహాసన్ తెలిపింది. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
వ్యక్తిగతంగా నరకం చూసానంటున్న శృతిహాసన్..
ఇదిలా ఉండగా శృతిహాసన్ కెరియర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నా.. వ్యక్తిగతంగా మాత్రం నరకం చూసానని చెబుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈమె గతంలో లండన్ కి చెందిన ప్రముఖ నటుడు మైఖేల్ కోర్సెల్ (Michael korsule) తో డేటింగ్ చేసింది. సహజీవనం కూడా చేశారు. కానీ 2019లోనే విడిపోయారు.
పెళ్ళి వరకు వెళ్లిన బంధం.. కానీ..
ఆ తర్వాత 2020లో విజువల్ ఆర్టిస్ట్ అయిన శంతను హజారికా(Santanu Hazarika) తో డేటింగ్ ప్రారంభించింది. సహజీవనం చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఎక్కువ కాలం వీరి బంధం నిలవలేదు. ఇక 2024లో వీరిద్దరూ విడిపోయారు. ఇక అలా వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. కానీ అలా బ్రేకప్ వల్ల నిరుత్సాహపడకుండా.. సంబంధాల్లో ఉన్నప్పుడు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకున్నాను అంటూ తెలిపింది. అయితే ఆ సంఘటనలే ఇప్పుడు తనను ఒక శిలలా మార్చేశాయని, అందుకే పెళ్లిపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది శృతిహాసన్.
ALSO READ:Bigg Boss: హౌస్ లో నటి ఆత్మహత్యాయత్నం.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన మేనేజ్మెంట్!