Ravi Teja New film : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకులుగా ప్రూవ్ చేసుకోవడానికే చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొన్ని ప్రయత్నాలు ఫలించాయి అనుకునే లోపే కొత్త కొత్త మలుపులు తిరుగుతాయి. అనగనగా ఒక రాజు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు కళ్యాణ్ శంకర్. ఆ సినిమాకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసి దర్శకుడుగా కళ్యాణ్ శంకర్ పేరు వేశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమాను కళ్యాణ్ శంకర్ వదిలేయాల్సి వచ్చింది.
అదే బ్యానర్ లో మ్యాడ్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాడు. ఆ సినిమా తర్వాత మ్యాడ్ స్క్వేర్ సినిమా చేసి ఆ సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. కళ్యాణ్ శంకర్ చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వసూలు చేశాయి. ఇక ప్రస్తుతం మాస్ మహారాజ్ గా సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మాస్ మహారాజా కండిషన్
ప్రస్తుతం రవితేజ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. ధమాకా సినిమా తర్వాత సరైన హిట్ ఇప్పటివరకు రవితేజకు పడలేదు. బాక్సాఫీస్ వద్ద ధమాకా సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు మాస్ జాతర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా హిట్ అయితే కానీ కళ్యాణ్ శంకర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్లు లేరు రవితేజ. బహుశా ఈ నిర్ణయాన్ని రవితేజ బ్యానర్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ కూడా తన నెక్స్ట్ సినిమాని ఇదే బ్యానర్ లో చేస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశాడు.
మరో దర్శకుడు కి గ్రీన్ సిగ్నల్
మరోవైపు రవితేజ దర్శకుడు శివ నిర్వాణ తో సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే దర్శకుడు శివ చెప్పిన కథ రవితేజకు విపరీతంగా నచ్చిందట. ఈ ప్రాజెక్టు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. మాస్ జాతర రిజల్ట్ ని బట్టి రవితేజ ఏ సినిమా చేస్తాడు అని తెలియాల్సి ఉంది. అలానే మాస్ జాతర సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన పాట కూడా విపరీతంగా ప్రేక్షకులను అలరించింది. ఏ ఐ టెక్నాలజీ తో చక్రి పాడినట్లు క్రియేట్ చేసిన ఈ పాట సినిమా మీద కూడా అంచనాలు పెంచింది.
Also Read: Hari Hara Veeramallu : ప్రసంగాలు ఆపేసి ప్రమోషన్స్ కి రావాలి, లేకపోతే నిర్మాత లైఫ్ రిస్క్