Hari Hara Veeramallu : వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తానని చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలయ్యాయి. ఈ సినిమా లేవీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించిన ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా హరిహర వీరమల్లు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు వాయిదాలు పడుతూనే ఉంది. ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారు కానీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మధ్యలోనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం, ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగాయి.
ప్రమోషన్స్ నిల్
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక వైబ్ ఉంటుంది. ఒక రకమైన పండగ వాతావరణం ఎలా ఉంటుంది. కానీ హరిహర వీరమల్లు సినిమా విషయంలో అలాంటిదేమీ జరగలేదు. హరి హర వీరమల్లు రిలీజ్ కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. కానీ, ఇంత వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే కానీ పని అయ్యేలా లేదు. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. బిజినెస్ కు మాత్రమే పనికొచ్చింది. కానీ, సినిమాపై బజ్ పెరగడానికి ఏం చేయడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలు బిజీ అయిపోయారు. కొద్దిసేపు వాటిని పక్కన పెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తే గాని, ఆడియన్స్ థియేటర్ కి వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ చేసిన హిందీ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
మూవీ యూనిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి.?
ఇకపోతే చిత్ర యూనిట్ ఇప్పుడు ఏం చేస్తుందో అని చాలామందికి ఆలోచన మొదలైంది. ముఖ్యంగా ఈ సినిమాను తీసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్స్ కి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి ప్రమోషన్స్ లో పాల్గొంటే కానీ బజ్ పెరగదు. ఎక్కడ చూసినా కేవలం ఏం రత్నం మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపిస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే ప్రయత్నం చేస్తారు అని తెలుస్తుంది. ఈలోపు హీరోయిన్, దర్శకుడు, నిర్మాత మాత్రమే సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటారు. అయితే తన సినిమాల విషయంలో ఎప్పుడు సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ చేశారు. అక్కడితో సరిపెడతారా, మరో ముందడుగు వేసి ప్రమోషన్స్ లో పాల్గొంటారా అనేది కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.
Also Read : AA22xA6 : నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్, ఇదెక్కడి ట్విస్ట్ భాయ్.?