పండుగ రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 24న మచిలీపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు (07642)ను అందుటులోకి తీసుకు రాగా, ఇదే రైలు చర్లపల్లి-మచిలీపట్నం మధ్య తిరుగు ప్రయాణం (07641) అక్టోబర్ 26న ప్రారంభం కానుంది. ఈ రైలె గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడే, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.
అటు రైలు నంబర్ 07093 చర్లపల్లి- బరౌని మధ్య అక్టోబరు 25న నడుస్తుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో బరౌని-చర్లపల్లి మధ్య(07094) అక్టోబర్ 27 న నడుస్తుంది. ఈ రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చందా ఫోర్ట్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జార్సుగూడ, రూర్కెలా, రాంచీ, మూరి, బొకారో స్టీల్ సిటీ, ధన్ బాద్, చిత్తరంజన్, మధుపూర్, జాసిదిహ్ స్టేషన్లలో రెండువైపులా ఆగుతాయి.
అటు నాందేడ్- పానిపట్ ప్రత్యేక రైలు(07635) అక్టోబర్ 29, నవంబర్ 3 మధ్య నడుస్తుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో (07636) పానిపట్- నాందేడ్ మధ్య అక్టోబర్30 నుంచి నవంబర్ 4 వరకు నడుస్తుంది. ఈ రైళ్లు పూర్ణ, పర్భాని, జల్నా, ఔరంగాబాద్, మన్మాడ్, జల్గావ్, భూసావల్, ఖాండ్వా, ఇటార్సి, రాణి కమలాపతి, బినా, ఝాన్సీ, ఆగ్రా కాంట్, మధుర, కోసి కలాన్ స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.
Read Also: పండుగ వేళ 973 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్!
అటు పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు కంటోన్మెంట్, కలబురగి మధ్య ప్రత్యేక రైలు సేవను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బెంగళూరు కంటోన్మెంట్–కలబురగి(06203) రైలు అక్టోబర్ 25న, కలబురగి–యశ్వంత్‌పూర్(06204) రైలు అక్టోబర్ 26న నడుస్తుంది. బెంగళూరు కంటోన్మెంట్–కలబురగి రైలు (06207) అక్టోబర్ 27న, కలబురగి–బెంగళూరు కంటోన్మెంట్ రైలు(06208) అక్టోబర్ 28న నడవనుంది. బెంగళూరు కంటోన్మెంట్–కలబురగి రైలు(06209) అక్టోబర్ 28న, కలబురగి–బెంగళూరు కంటోన్మెంట్ రైలు(06210) అక్టోబర్ 29న నడుస్తుందని అధికారులు వెల్లడించారు. పండుగ వేళ ఈ ప్రత్యేక రైలు సర్వీసులను ప్రయాణీకులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇబ్బంది లేకుండా ప్రయాణించాలన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Read Also: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!