BigTV English

Telangana : డెడ్‌బాడీ ట్విస్ట్.. అంత్యక్రియలకు ముందు ఏం జరిగిందంటే..

Telangana : డెడ్‌బాడీ ట్విస్ట్.. అంత్యక్రియలకు ముందు ఏం జరిగిందంటే..

Telangana : కుటుంబ పెద్ద చనిపోయారు. కడసారి చూపుల కోసం బంధువులు తరలివచ్చారు. అంతా ఏడుస్తున్నారు. డప్పుచప్పుళ్లతో అంతిమయాత్ర ధూంధాంగా చేశారు. చనిపోయినవాడు తిరిగి బతుకుతాడనే చిన్న ఆశతో.. దింపుడుకళ్లెం దగ్గర చివరి పిలుపు పిలిచారు. అక్కడే అనుకోని ట్విస్ట్. చనిపోయిన తండ్రి చెవిలో కూతురు నాన్నా నాన్నా అని పిలుస్తుండగా.. ఆమెకు అనుమానం వచ్చింది. ఆయన చేతికి ఉండాల్సిన పచ్చబొట్టు కనిపించలేదు. డౌట్‌తో మరింత పరీక్షగా పరిశీలించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే మేటర్ బంధువులకు చెప్పింది. అంతా అదిరిపోయారు. మృతదేహానికి చుట్టిన చాపను విప్పి చూశారు. అంతే. అంతా షాక్. అది ఆ కుటుంబ పెద్ద డెడ్‌బాడీ కాదు. వేరే ఎవరిదో. వెంటనే హాస్పిటల్‌కు పరుగులు పెట్టారు. తమ వాడు ఎక్కడంటూ ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అనేక ట్విస్టులు ఉన్నాయి.


అసలేం జరిగిందంటే..

తమ బంధువు మృతదేహం అనుకొని మరొకరి డెడ్‌బాడీకి అంత్యక్రియలు చేయబోయారు కుటుంబ సభ్యులు. తీరా ఆ మృతదేహం తమ బంధువుది కాదని తెలిసి ఖంగుతిన్నారు. రాయపర్తి మండలం మైలారంకు చెందిన గోక కుమారస్వామి తీవ్ర అనారోగ్యంతో MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కోసం ఆసుపత్రికి వెళ్లిన కుటుంబసభ్యులకు కుమారస్వామి చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో మృతదేహన్ని చాపలో చుట్టి ఇంటికి తీసుకొచ్చారు. చాపలో చుట్టిన మృతదేహాన్ని భార్య రమతో పాటు బంధువులు సైతం గుర్తించలేదు. చివరకు దింపుడుగళ్లెం నిర్వహిస్తుండగా, కుమారస్వామి కూతురు స్వప్న గుర్తించింది. తన తండ్రి చేతిపై ఉండాల్సిన పచ్చబొట్టు లేదని చెప్పడంతో, అది కుమారస్వామి డెడ్‌బాడీ కాదని తెలుసుకున్నారు. వెంటనే మృతదేహన్ని అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. కట్ చేస్తే.. కుమారస్వామి బతికే ఉన్నాడని.. హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నాడని తెలిసి అంతా అవాక్కయ్యారు.


మతిస్థిమితం లేని రోగి.. కట్ చేస్తే..

మూడు రోజుల క్రితం గోక కుమారస్వామి తొర్రూరు టౌన్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పోలీసులు అతన్ని వరంగల్‌లోని MGM హస్పిటల్‌కు తరలించారు. కుమారస్వామి బంధువుల కోసం ఆరా తీయగా.. ఆయన భార్య రాయపర్తి మండలంలోని మైలారంలో ఉంటున్నట్టు గుర్తించారు. 30 ఏళ్ల క్రితం ఇద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. 20 ఏళ్ల క్రితం కుమారస్వామి మతిస్థిమితం కోల్పోగా.. రమ అతడిని వదిలేసి పుట్టింటి దగ్గరే కూతురుతో కలిసి ఉంటోంది. కుమారస్వామి తొర్రూరు పట్టణంలో యాచిస్తూ.. బస్టాండ్ దగ్గర నివాసం ఉంటున్నాడు. ఈనెల 9న రోడ్డు పక్కన పడి ఉండడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భార్య రమ ఆసుపత్రి సిబ్బందికి తన వివరాలు ఇచ్చి వెళ్లింది. మర్నాడు కుమారస్వామి కోసం మరోసారి వెళ్లగా.. అతను చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

సిబ్బందిపై చర్యలు ఉంటాయా?

డెడ్‌బాడీని చాపలో చుట్టి ఇవ్వడంతో.. అంబులెన్స్‌లో మైలారం గ్రామానికి తీసుకెళ్లారు. అంత్రక్రియల సమయంలో చనిపోయింది కుమారస్వామి కాదని.. ఆ మృతదేహం మరొకరిదని తేలడంతో అంతా ఖంగుతిన్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. తమ వాడు చనిపోయాడని.. గుర్తు తెలియని శవానికి తాము అంత్యక్రియలు చేయాల్సి వచ్చేదని వాపోయారు బంధువులు. హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×