OTT Movie : ఒక హాలీవుడ్ మినీ వెబ్ సిరీస్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. కేవలం రెండు ఎపిసోడ్స్ ఉన్న ఈ కథ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ స్టోరీ ఒక హైస్కూల్‌లో జరుగుతుంది. ఒక అమ్మాయి తన తన మ్యాజిక్ పవర్ ని ఉపయోగించి, ఒక మాన్స్టర్ తో స్కూల్‌ని కంట్రోల్ చేస్తుంది. కానీ చివరకు ఆ మాన్స్టర్ తనపైనే తిరగబడుతుంది. దీని పేరు ఏమిటి ? ఎక్కడ చూడచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘ట్రబుల్డ్ యూత్’ (Troubled Youth) అమెరికన్ హారర్ మినీ సిరీస్. ఎమిలీ డెల్ డైరెక్ట్ చేసిన షార్ట్ హారర్ సిరీస్. మొత్తం 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో కామి స్టార్మ్ (ఎవా), నెఖబెట్ కుమ్ జూచ్ (క్యాథరిన్), గార్డన్ టార్ప్లీ (జాక్), క్రిస్టియన్ వెంటురా (అలెక్స్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2018 జనవరి 19 న YouTube, Crypt TV ఛానల్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDbలో దీనికి 6.0/10 రేటింగ్ ఉంది.
ఒక అమెరికన్ హైస్కూల్‌లో ఎవా అనే అమ్మాయి చాలా స్మార్ట్ గా ఉంటుంది. ఆమెకు సైకిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆమె స్కూల్‌లో అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఎవా దగ్గర ఒక సీక్రెట్ ఉంటుంది. క్యాథరిన్ అనే లైబ్రేరియన్ ను ఒక మాజిక్ నెక్లెస్ ద్వారా ఎవా కంట్రోల్ చేస్తుంటుంది. క్యాథరిన్ ఆ నెక్లెస్ వల్ల మాన్స్టర్‌గా మారుతుంది. ఎవా ఈ మాన్స్టర్‌ని తన ‘పెట్ గా ఉపయోగించి, స్కూల్‌లో బలహీనమైన వాళ్లను టార్గెట్ చేస్తుంది. ఆమె “వుల్వ్స్” అనే బలమైన గ్రూప్‌ని స్టార్ట్ చేసి, స్కూల్‌ని రూల్ చేయాలనుకుంటుంది. ఆమె బలహీనమైన స్టూడెంట్స్‌ని “షీప్” అని, బలమైన వాళ్లని “వుల్వ్స్” అని పిలుస్తుంది.
Read Also : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్