BigTV English

Tollywood: సమ్మె వెనుక భారీ కుంభకోణం.. ఛాంబర్‌,చిత్రపురి ఎన్నికలు అడ్డుకునేందుకే ఈ కుట్ర

Tollywood: సమ్మె వెనుక భారీ కుంభకోణం.. ఛాంబర్‌,చిత్రపురి ఎన్నికలు అడ్డుకునేందుకే ఈ కుట్ర


Reason Behind Cine Workers Strike: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైపు సరైన హిట్స్లేక బాక్సాఫీసు కష్టాలు.. మరోవైపు కార్మికుల సమ్మె. సినీ కార్మికుల సమ్మె వల్ల టాలీవుడ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద హీరోలు, బడా నిర్మాతల సినిమాలు తప్పితే.. మీడియం, చిన్న సినిమాల షూటింగ్స్అన్ని ఆగిపోయాయి. దీంతో నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. వేతనాలు పెంపులు నిర్మాతలు హామీ ఇవ్వాలని, లేదంటే సమ్మె విరమించేది లేదని అంటున్నారు. మరోవైపు నిర్మాత ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఇస్తున్నామని పెంచే ప్రసక్తి లేదని తేల్చేస్తున్నారు.

సమ్మె వెనక నాయకుల కుంభకోణం


దీంతో నిర్మాతల తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్స్ని అడ్డుకుంటూ.. పనిలోకి వెళ్తున్నవారిని బెదిరిస్తున్నారుఅయితే కార్మికుల సమ్మె వెనుక పెద్ద కుంభకోణం ఉందంటున్నారు. సమ్మె వల్ల నష్టపోయేది కార్మికులే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వీరిని అడ్డుపెట్టుకుని యూనియన్నాయకులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. తాను కార్మికుల పక్షపాతిని అని చెప్పుకునే నాయకులే వారికి ద్రోహం చేస్తున్నారు. నరబలి, కోబలి అంటూ కార్మికులను రెచ్చగొడుతున్నారు. అయితే సమ్మె వెనుక పెద్ద కుట్రకోణం ఉందటయూనియన్లకు ప్రభుత్వం కొన్ని నిబంధలు పెట్టిందిసమ్మెకు వెళ్లాలంటే ముందస్తుగా నోటీసు ఇవ్వాలి. కానీ నిబంధనను ఫెడరేషన్తోసిపుచ్చుతూ.. రాత్రి రాత్రే సమ్మెకు పిలుపునిచ్చింది. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఆ ఎన్నికలు ఆపేందుకే ఇదంత

అయితే సమ్మె వెనకు ఛాంబర్ఎలక్షన్స్‌, చిత్రపురి కాలనీ ప్రెసెడెంట్ఎన్నికలు ఆపేందుకే కుట్ర పన్నారంటున్నారు ఇండస్ట్రీ పండితులు. కార్మికుల కోసం పోరాటం చేస్తున్నట్టు యూనియన్లీడర్లు పైకి చేస్తున్నంత ఉట్టి నాటకమని, దీనిక వెనక కొందరి నాయకుల స్వార్థపూరితమైన ఆలోచనలు దాగి ఉన్నాయట. ఛాంబర్ఎలక్షన్స్జరగకుండ ప్రస్తుతం ఉన్న సెక్రటరీ, ప్రెసెడెంట్పద్మభూషణం.. మరోవైపు చిత్రపురి కాలనీలో వల్లభనేని అనిల్ ప్రెసిడెంట్ఎన్నికలు జరగకుండ చేయడానికి సడెన్గా సమ్మెని నిర్వహించారట. అందుకే ముందస్తు నోటీసు లేకుండ సమ్మెకు పిలుపునిచ్చారుమరోవైపు చిత్రపురి కాలనీ ప్లాట్అమ్మాకాల్లో కార్మికులను మోసం చేస్తున్నారు.

తక్కువ ధరకు సినీ కార్మికుల ప్లాట్స్అమ్మేలా ప్రభుత్వం చిత్రపురి కాలనీ భూములను కేటాయించింది. అంతేకాదు ఒక స్క్వేర్ఫీట్ఇంతే అమ్మాలని ధరలను కూడా నిర్ణయించారు. కానీ కార్మికుల కోసమే కేటాయించిన భూమిని స్క్వేర్ఫీట్కు రూ. 7వేల చొప్పున ధర నిర్ణయించి కార్మికుడు కొనలేని పరిస్థితులు తీసుకువస్తున్నారు. లా 800 sftలో డబుల్బెడ్రూమ్స్కట్టి స్క్వేర్ఫీట్కు రూ. 4వేల చొప్పున కార్మికుడికి ఇవ్వోచ్చు. కానీ, అలా చేయకుండ ఎక్కువ ధరలు పెట్టి ఎన్ఆర్ఐలకు అమ్మాలనే కుట్ర జరుగుతోంది. ప్రస్తుతం చిత్రపురి కాలనీ భూమి వివాదం కోర్టు పరిధిలో ఉంది. అలాంటి భూమిలో ఆగష్టు 17 చండీహోమం నిర్వహించి.. భూమి పూజ చేస్తానడటం విడ్డూరంగా ఉంది. ఇలా యూనియన్నాయకులు కార్మికుల వెనుక భారీ కుంభకోణం, సమ్మె పేరుతో కుట్రలు చేస్తూ వారిని బలి చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related News

War 2 Duration : సినిమా డ్యూరేషన్ మరీ అంత సేపా? ఎవరిని పరీక్షిస్తున్నారయ్యా..

Nani Paradise: ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో నాని పారడైజ్ ఫస్ట్ లుక్, ఈసారి ఏమి తగలబెడతాడో

Ntr -Hrithik: ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ పంపిన హృతిక్… అసలైన వార్ అప్పుడే అంటూ తారక్ రిప్లై!

Prashanth Neel: సలార్ ఎఫెక్ట్.. ఆ హీరోకి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్.. కావాలని చెయ్యలేదంటూ!

Usthad Bagath Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన సమ్మె ఎఫెక్ట్ ఏమైనా పడిందా ? ప్రొడ్యూసర్ రిప్లై…

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ నేనే యాక్షన్ తీసుకుంటాను, మండిపడ్డ కే ఎ పాల్

Big Stories

×