BigTV English

Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంది.. బీజేపీకి ఆ సత్తా ఉందా? మహేష్ గౌడ్ ఫైర్!

Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంది.. బీజేపీకి ఆ సత్తా ఉందా? మహేష్ గౌడ్ ఫైర్!

Mahesh Goud: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా సాక్షిగా, దేశ రాజకీయాల్లో బీసీలు మరింత దృఢంగా తమ హక్కులను డిమాండ్ చేస్తున్న దృశ్యం స్పష్టమైంది. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాలు చేస్తాం అంటున్న మోడీ, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు… మరి బీసీల కోసం ఎందుకు వెనుకడుగు? అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు.


బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసిన గౌడ్, జిత్నీ అబాదీ, ఉత్నా హిస్సా అన్న రాహుల్ గాంధీ మాటలు నిజం చేయాల్సింది మోడీ సర్కారే అని స్పష్టం చేశారు. దేశ జనాభాలో బీసీల వాటా అత్యధికంగా ఉన్నా… వారి హక్కులు మాత్రం మూలన పడేయబడ్డాయని ఆయన విమర్శించారు.

రేవంత్ రెడ్డి మొనగాడు..
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని గౌడ్ ఘనంగా ప్రశంసించారు. సాహసోపేతంగా రెండు చట్టాలు తీసుకొచ్చారు. గవర్నర్ నిరాకరించినా నాలుగు నెలల పాటు పట్టుదలతో పోరాడారు. ఆ తీర్పుతోనే ఈ రోజు బీసీల పక్షాన గొంతెత్తే ధైర్యం వచ్చింది అంటూ చెప్పారు.


మోడీ, కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు
మహేష్ గౌడ్ తన ప్రసంగంలో ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీకి 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేసే శక్తి ఉంది. కానీ రాహుల్ గాంధీ పేరు వినగానే భయపడుతున్నారు. అదే కారణంగా రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, సికింద్రాబాద్‌ నుంచి నామినేషన్ వేయాలని చూస్తున్నావా? కానీ నీ మాటలు బీసీలను నమ్మించలేవు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సొల్లు కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేయడం ఆపండి అంటూ బీజేపీని తీవ్రంగా విమర్శించారు.

బీసీలు రుణం తీర్చాల్సింది రాహుల్ గాంధీకి
రాహుల్ గాంధీకి బీసీలు రుణపడి ఉండాలని గౌడ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే, రిజర్వేషన్‌ హక్కులను ఢిల్లీలో ధర్నాల వరకు తీసుకువచ్చిన నాయకుడు రాహుల్ మాత్రమేనని ఆయన అభిప్రాయం. కామారెడ్డిలో జరిగిన బీసీ సభలో 42 శాతం రిజర్వేషన్ల డిక్లరేషన్‌ ప్రవేశపెట్టడాన్ని ఆయన ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. ఒకసారి కాదు, రెండు చట్టాలు చేసిన ఘనత రేవంత్‌ది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ తరఫ్ దేకో అంటున్నారు రాహుల్ గాంధీ అంటూ పేర్కొన్నారు.

Also Read: Bullet train India: బుల్లెట్ ట్రైన్ టైమ్ వచ్చేసింది.. ఇక మిగిలింది అదొక్కటే.. సిద్ధం కండి!

ప్రొద్దున లేస్తే దేవుళ్ళకు పూజ చేస్తాం, సాయంత్రం ముస్లింల జపం వినిపిస్తుంది. అదే భారతీయత, అదే మానవత్వం అని అన్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లను వేరే దారి పట్టిస్తున్నారని ఆయన అభిప్రాయం. బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు ఇవ్వకపోతే దేశ ప్రజలు ప్రశ్నిస్తారని, న్యాయం జరగాల్సిందేనని అన్నారు.

బీసీల ఉద్యమానికి ఇది ఆరంభం మాత్రమే
పట్టుదలతో సాధించుకుంటాం, రిజర్వేషన్లు తెచ్చుకుందాం. ఇది పార్టీ విషయం కాదు, సమాజ హక్కుల కోసం పోరాటమని గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని మన అందరి పార్టీగా వివరించిన గౌడ్, బీసీలు కాంగ్రెస్ పట్ల నమ్మకంతో ఉన్నారని, రాహుల్, రేవంత్‌ల నాయకత్వంలో బీసీల హక్కులకు పోరాటం తారాస్థాయికి చేరుతుందని చెప్పారు.

Related News

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

BRS BC Meeting: బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా..? కాంగ్రెస్ ధర్నా సక్సెసే కారణమా?

CM Revanth Reddy: కేంద్రంలో బీజేపీని గద్దె దింపుతాం.. సిఎం రేవంత్ రెడ్డి

Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!

Raj Gopal Reddy: కేసీఆర్ మౌనంగా ఉంటే ఎలా? లేదంటే రాజీనామా చేయ్..

Big Stories

×