BigTV English

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Mohammed Siraj :  ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Mohammed Siraj :  టీమిండియా (Team India)  జట్టు ఇటీవల ఇంగ్లాండ్ (England)  కి పయనమై.. అక్కడ 5 టెస్ట్ సిరీస్ మ్యాచ్ లు ఆడింది. అందులో 2-2 తో సమం చేసింది. ఒక మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో టీమిండియా కీలక బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలకంగా వ్యవహరించాడు. దీంతో సిరాజ్ టీమిండియా హీరోగా మారాడు. తాజాగా మహ్మద్ సిరాజ్ లండన్ నుంచి ఇండియా గడ్డపై అడుగుపెట్టాడు. అయితే సిరాజ్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే అభిమానులు బారులు తీశారు. సెక్యూరిటీ అందించారు. ప్రస్తుతం సిరాజ్ ఎయిర్ ఫోర్ట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read : Arshdeep singh : మహిళలను అవమానించిన అర్ష్ దీప్ సింగ్.. ఆ గొంతుతో ఇమిటేట్ చేస్తూ

సిరాజ్ అదుర్స్.. 


ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో గణనీయమైన స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. 12 స్థానాలు ఎగబాకి కెరీర్ లో తొలిసారి టాప్ 15లో నిలిచాడు. దీంతో సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానానికి చేరాడు. ఇంతకుముందు ఈ హైదరాబాదీ పేసర్ బెస్ట్ ర్యాంకు 16. ఓవల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. టీమిండియా మరో పేసర్ ప్రసిద్ధ్ 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకులో నిలిచాడు. రవీంద్ర జడేజా మూడు స్థానాలు డౌన్ అయి 17వ ర్యాంక్ లో నిలిచాడు. ఇక ఓవల్ టెస్ట్ కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్ లో జైస్వాల్, బుమ్రా 

ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తిరిగి టాప్ లోకి వచ్చాడు. మూడు స్థానాలు మెరుగై 792 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ ఎనిమిదో స్థానంలో ఉండగా.. శుబ్ మన్ గిల్ నాలుగు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్ కి పడిపోయాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జోరూట్, హ్యారీ బ్రూక్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. వాస్తవానికి ఈ టెస్ట్ సిరీస్ లో సిరాజ్ 5 టెస్టులు ఆడాడు. అందరికంటే ఎక్కువ బంతులు విసిరాడు. అత్యధిక వికెట్లు సాధించాడు. టీమిండియా అసాధారణ విజయాన్ని అందించిపెట్టాడు. అన్ని మ్యాచ్ లు ఆడినా అలసట లేకుండా ఆకట్టుకున్నాడు. దీనికి కారణం కఠిన డైట్, ఫిట్ నెస్ విషయంలో క్రమశిక్షణే కారణం. ఈ విషయం ఎవ్వరో చెప్పింది కాదండోయ్ తన సోదరుడు ఇస్మాయిల్ చెప్పాడు. సిరాజ్ చిరుతిళ్లకు చాలా దూరంగా ఉంటాడు. హైదరాబాద్ లో ఉన్నా అరుదుగా బిర్యానీ తింటాడు. ఇంట్లో చేసిన బిర్యానీ ని మాత్రమే అప్పుడప్పుడు తీసుకుంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా కసరత్తులు చేయడం మాత్రం మానలేదు. జిమ్ కి వెళ్లి ఫిట్ నెస్ సాధించాడు. మా కుటుంబం అంతా సిరాజ్ ని చూసి గర్వపడుతుందని.. కేవలం కుటుంబమే కాదు.. యావత్ దేశం కూడా సిరాజ్  పై ప్రశంసలు కురిపించడం గర్వంగా ఉందని సిరాజ్ సోదరులు ఇస్మాయిల్ పేర్కొన్నారు.

Related News

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్‌.. తొలిసారిగా 400పైగా స్కోర్

Suryakumar Yadav : వాడి వ‌ల్లే ఒమ‌న్ పై బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాను..సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సూర్య కుమార్‌

Big Stories

×