BigTV English

OTT Movie : పార్టీ చేసుకుంటే వీడి చేతిలో చావే… జనాల్ని గడగడా వణికించే సీరియల్ కిల్లర్… నరాలు తెగే సస్పెన్స్

OTT Movie : పార్టీ చేసుకుంటే వీడి చేతిలో చావే… జనాల్ని గడగడా వణికించే సీరియల్ కిల్లర్… నరాలు తెగే సస్పెన్స్

OTT Movie : థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చే సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వీటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్ లు ముందు వరుసలో ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. అయితే ఈ కిల్లర్ టార్గెట్ ఒక్కొక్కరితో కాకుండా, ఒకే సారి వందల్లో ఉంటుంది. ఈ కథ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో ఒక సైకో గన్ తో వందలమందిని టార్గెట్ చేయడంతో మొదలవుతుంది. ప్రతి సీన్ ఉత్కంఠంగా సాగే ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

బాల్టిమోర్‌లో నూతన సంవత్సర వేడుకలో ఒక స్నైపర్ హై-రైజ్ అపార్ట్‌మెంట్ నుండి పార్టీ చేసుకుంటున్న 29 మందిని రాండమ్‌గా షూట్ చేసి చంపుతాడు. ఆ తర్వాత బాంబు పేలుడుతో తన ఆనవాళ్లను దాచిపెడతాడు. ఈ ఘటనకు ఎలియనోర్ అనే ఒక మహిళా పోలీసును లామార్క్ అనే ఆమె పై అధికారి నియామిస్తాడు. ఆమె ఒకప్పుడు డ్రగ్ అడిక్షన్ లో ఉండేది. ఇప్పుడు దాని నుంచి బయటపడి ఒక డిప్రెషన్ లో ఉంటుంది. అయితే ఆమె మీద నమ్మకంతోనే ఈ కేసును డీల్ చేయమని ఇస్తాడు. ఎందుకంటే ఆమె మెంటాలిటీ కిల్లర్ ని అర్థం చేసుకోగలదని అతను భావిస్తాడు. లామార్క్, ఎలియనోర్ ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఒక టీమ్‌గా పనిచేస్తారు. ఎలియనోర్ గత ట్రామా, కిల్లర్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

సెకండ్ హాఫ్‌లో దర్యాప్తు మరింత తీవ్రమవుతుంది. కిల్లర్ ఒక వెజిటేరియన్ అని, పాత మిలిటరీ ఆయుధాలకు యాక్సెస్ ఉన్న వ్యక్తి అని తెలుసుకుంటారు. ఎలియనోర్ ఒక కీలక సన్నివేశంలో కిల్లర్‌ను డీన్ పోస్సీగా గుర్తిస్తుంది. అతను చిన్నతనంలో తలకు గాయం కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతూ, సమాజంపై కోపంతో ఉన్న ఒక స్ప్రీ కిల్లర్. ఈ సమయంలో డీన్ మాల్‌లో మరో షూటింగ్‌తో 70 మందికి పైగా చంపుతాడు. క్లైమాక్స్‌లో ఎలియనోర్, డీన్‌ మధ్య ఉత్కంఠభరితమైన చేసింగ్ సీన్ నడుస్తుంది. అయితే కిల్లర్ ఆమెను బంధిస్తాడు. కానీ ఆమె ధైర్యంగా అతని గొంతును కొరికి గాయపరుస్తుంది. ఇక ఊహించని మలుపుతో ఈ స్టోరీ ముగుస్తుంది. ఎలియనోర్ కిల్లర్ ని పట్టుకుంటుందా ? డీన్‌ ఎందుకు సైకో కిల్లర్ గా మారాడు ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘టు క్యాచ్ ఎ కిల్లర్’ (To catch a killer) 2023లో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఇది డామియన్ స్జిఫ్రాన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో షైలీన్ వుడ్లీ (ఎలియనోర్ ఫాల్కో), బెన్ మెండల్సోన్ (జాఫ్రీ లామార్క్), జోవన్ అడెపో (జాక్ మెకెంజీ), రాల్ఫ్ ఇనెసన్ (డీన్ పోస్సీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం వెర్టికల్ ఎంటర్‌టైన్మెంట్ ద్వారా 2023 ఏప్రిల్ 21న థియేట్రికల్ రిలీజ్ అయింది. 2023 జూలై 11 నుండి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. 1 గంట 59 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.6/10 రేటింగ్ పొందింది.

Read Also : డిన్నర్ కోసం వెళ్లి దిక్కుమాలిన ట్రాప్‌లో… ఈ క్రేజీ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందంటే?

Related News

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

OTT Web Series: ఈ 10 వెబ్ సీరిస్‌లు చూస్తే రాత్రంతా జాగారమే.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి మామ!

OTT Movie : భర్త ఉండగానే మరో అబ్బాయితో… సీక్రెట్ ప్రియుడి హత్యతో అల్టిమేట్ ట్విస్ట్… గ్రిప్పింగ్ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల చర్మాన్ని వలిచి అమ్ముకునే రాకెట్… వలపు వల వేసి ట్రాప్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : డబ్బు కోసం అబ్బాయితో ఆ ఆట… ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసే ఖతర్నాక్ కిలాడీ… ఊహించని క్లైమాక్స్

kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×