BigTV English

Manchu Vishnu: మంచు విష్ణు మీద కేసు వేస్తా.. శివుడి గురించి తప్పుగా చూపించారు

Manchu Vishnu: మంచు విష్ణు మీద కేసు వేస్తా.. శివుడి గురించి తప్పుగా చూపించారు

Manchu Vishnu: ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు ఈరోజు తెరపడింది. కన్నప్ప.. కన్నప్ప అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన మంచు విష్ణు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డ్రీమ్ ప్రాజెక్ట్, 100 కోట్లు ఖర్చు పెట్టాము.. ఆస్తులు అమ్ముకొని ఈ సినిమా తీస్తున్నాం అని మంచి ఫ్యామిలీ డబ్బా కొడుతూనే  వచ్చింది. అసలు నార్మల్ గా అయితే మంచు విష్ణు సినిమాకు ఈ రేంజ్ హైప్ రావడానికి కారణం ప్రభాస్. కన్నప్ప సినిమాలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు అని తెలియడంతోనే అభిమానులు కన్నప్పకు వెళ్లడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు.


 

ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య నేటి ఉదయం రిలీజ్ అయ్యింది. మొదటిసారి.. మొట్టమొదటిసారి మంచు విష్ణు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం. దానికి కారణం కూడా ప్రభాస్ నే. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి 20 నిముషాలు మరో ఎత్తు.  ఎందుకంటే అప్పుడే కదా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేది. సరే సినిమా కథ ఎలా ఉంది అంటే.. అసలు బేసిక్  నాలెడ్జ్ లేని కథ అని తీసిపడేస్తున్నారు.


 

భక్త కన్నప్ప కథ గురించి తెలియని తెలుగువాడు ఉండడు. శివునికి పరమ భక్తుడు అయిన కన్నప్ప తన కన్నును సైతం శివునికి అర్పించి.. తన భక్తిని నిరూపించుకుంటాడు. ఒరిజినల్ గా అయితే ఇదే. తెరకెక్కించాలి. కానీ విష్ణు మాత్రం మొదటి భాగం మొత్తం తన హీరోయిజాన్ని చూపించడానికి వాడుకున్నాడు. ఇది కన్నప్ప కథలా లేదు తిన్నడు కథగా ఉందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. శివుడి భక్తుడిగా తిన్నడు ఎలా మారాడు అనేది ఎంత ఆధ్యాత్మిక పద్దతిలో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది భక్తి సినిమా కాబట్టి.

 

కన్నప్ప సినిమా కోసం యువత మాత్రమే కాదు. పెద్దవారు కూడా ఎదురుచూసారు. కానీ, వారితో కలిసి కన్నప్ప మొదటి భాగాన్ని చూడడం కష్టమే అంటున్నారు. తిన్నడు, నెమలి మధ్య రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అసలు ఏం చుపించాలనుకున్నారు.. ఏం చూపించారు. విష్ణు హీరోయిజాన్ని మొత్తం మొదటి భాగంలో చూపించారు. దానికి ఎందుకు కన్నప్ప సినిమా అని చెప్పుకొచ్చారు. తిన్నడి సినిమా అని చెప్పుకోవచ్చుగా అని ఒక ప్రేక్షకుడు ఫైర్ అయ్యాడు.

 

కన్నప్పలో అంతా తప్పుగా చూపించారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాలో అంతా తప్పుడు సమాచారం ఇచ్చారని, మొదటి భాగం మొత్తం శివుడు గురించి ఏం చెప్పలేదని, మంచు విష్ణు తన హీరోయిజాన్ని చూపించడానికి వాడుకున్నాడని ఆరోపించాడు. శివుడి గురించి తప్పుగా చూపించినందుకు విష్ణుపై కేసు వేస్తానని, ప్రమోషన్స్ లో కన్నప్ప కథ అని చెప్పి.. థియేటర్ లో తిన్నడు కథను చూపించి వెర్రివాళ్లను చేసినట్లు తెలిపాడు. అసలు సినిమాలో కన్నప్ప కథనే లేదని, కృష్ణంరాజు కన్నప్ప సినిమా హక్కులను తీసుకొని ఇలాంటి సినిమానా నువ్వు చేసేది అని రెచ్చిపోయాడు.

 

ఇక చివర్లో ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు బావుందని, థియేటర్ లో చూడాల్సిన సినిమా అయితే కాదని, టికెట్ కొనుక్కుంటే కనుక సెకాండాఫ్ కి మాత్రమే వెళ్ళమని, ఓటీటీలో వచ్చేవరకు వేచి చూడొచ్చని, ఇదొక వేస్ట్ సినిమా అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×