Ahmedabad Rath Yatra: గుజరాత్‌లోని గోల్‌వాడ దగ్గర జగన్నాథ రథయాత్రలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. వీధుల్లో ఊరేగింపుగా వస్తున్న ఏనుగుల్లో ఒకటి ఒక్కసారిగా పరుగులు తీయడం ప్రారంభించింది. దీంతో అక్కడున్న భక్తులంతా పరుగులు తీయడం మొదలుపెట్టారు. దీంతో స్వల్ప తొక్కిసలాట నమోదైంది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ అనుకోని పరిణామం వల్ల.. భక్తులు గందరగోళానికి గురై పరుగులు తీశారు. కొన్ని షాపులు, బారికేడ్లు ఏనుగుల దెబ్బకి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కొంతమంది స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది.
మావటిలు వెంటనే అప్రమత్తమై ఏనుగు వెంట పరుగులు తీశారు. వెంటనే దానిని కంట్రోల్ చేశారు. లేదంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేది అంటున్నారు అధికారులు.
ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు.. యాత్ర మార్గంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని.. అధికారులు స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని, యాత్ర అనుకున్న విధంగానే కొనసాగుతుందని వెల్లడించారు.
కాగా ఎంతో వైభవంగా.. ప్రతిష్టాత్మకంగా జరిగే పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర సందడి మొదలైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రథయాత్ర జరగనుంది. ఈ వేడుక కోసం ప్రతి ఏడాదీ ప్రత్యేకంగా దారు రథాలు తయారయ్యాయి. లక్షలాది భక్తులు పాల్గొనే ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. గరుడ ధ్వజం రథంలో జగన్నాథుడు, తాళధ్వజ రథంలో బలరాముడు, పద్మధ్వజ రథంలో సుభద్ర అధిరోహిస్తారు. అనంతరం ఈ మూడు రథాలను ఉరేగింపుగా తీసుకెళతారు.
ఇందులో జగన్నాథుడు కొలువు తీరిన రథం అన్నిటికన్నా ఎత్తయినది. మిగతా రెండూ ఒకదానికొకటి మరి కాస్త చిన్నగా ఉంటాయి. ఆ రథాలకు అలంకరించే రంగు రంగుల వస్త్రాలూ, రథాల పీఠాలూ, స్తంభాలూ, కొయ్య గుర్రాలూ అన్నీ వేటికవే ప్రత్యేకం.
ప్రతి ఏడాది ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు (జూన్-జులైలో) జరిగే ఈ యాత్ర, జగన్నాథుని ప్రేమ, కీర్తి, కాంచనాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది.
Also Read: పూలమ్ముతూ కొడుకుకు లక్షన్నర బైక్ కొన్న తండ్రి.. ఈ పోలీస్ అధికారి మాటలు హార్ట్ టచ్ అవుతాయ్!
పూరీ వీధుల్లో లక్షలాది భక్తులు తరలివస్తారు. “జయ జగన్నాథ!” అనే నినాదాలతో మార్మోగుతుంది. భక్తులు స్వయంగా రథాన్ని లాగేందుకు ముందుకెళ్తారు. ఇది కేవలం ఉత్సవం కాదు.. పరమాత్మను దగ్గరగా అనుభవించే ఒక ఆధ్యాత్మిక యాత్ర. స్త్రీలు, పురుషులు, పిల్లలు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ పరవశంలో తేలిపోతారు.
ఇది కేవలం భారత దేశానికే పరిమితమైన పండుగ కాదు. అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల్లోనూ జగన్నాథ రథయాత్ర జరుపుకుంటున్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత వేదిక ఇది.
జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకొచ్చిన ఏనుగు!
గుజరాత్‌లోని గోల్‌వాడ వద్ద జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో అపశృతి
రథయాత్రలో భాగంగా తీసుకొచ్చిన ఓ ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లే ప్రయత్నం
దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప తొక్కిసలాట
తొమ్మిది మందికి గాయాలైనట్లు సమాచారం… pic.twitter.com/PNOnLBZA7o
— BIG TV Breaking News (@bigtvtelugu) June 27, 2025