E-Paper
Advertisement

డబ్బు పవర్ అంటే ఇదేనేమో.. ఇట్లు అర్జున కోసం క్యూ కట్టేసిన టాలీవుడ్‌!

డబ్బు పవర్ అంటే ఇదేనేమో.. ఇట్లు అర్జున కోసం క్యూ కట్టేసిన టాలీవుడ్‌!
Advertisement

Itlu Arjun: ‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజుగారంటారు’ అన్నాడో సినీ కవి.ఇక డబ్బుకు లోకం దాసోహం,పైసా,పైసా మే పరమాత్మ,మనీ అంటూ డబ్బు చుట్టూ మన దర్శకులు బోలెడు సినిమాలు తీశారు కూడా.డబ్బులు జీవితంలో కీ రోల్ పోషిస్తాయో కళ్ళకి కట్టినట్టు చూపించారు.

ఇక మన రియల్ లైఫ్ లోనూ డబ్బుంటే ఎలా ట్రీట్ చేస్తారో అనేక సార్లు చూస్తుంటాం కూడా.ఇదిగో ఇపుడు ఇండస్ట్రీలో అదే విషయం మరోసారి ప్రూవ్ అవుతుంది.రీసెంట్ గా వచ్చిన ‘ఇట్లు అర్జున’ అనే సినిమాలో హీరో కొత్తవాడైనప్పటికీ టాలీవుడ్ అంతా సినిమాని ఆకాశానికి ఎత్తేస్తూ క్యూ కట్టేస్తున్నారు.

Advertisement

కారణం ఏంటో తెలుసా ..అందులో నటించిన హీరో సాయి అనీష్ రెడ్డి ఇండస్ట్రీకి కొత్త వాడైనప్పటికీ అతడి తండ్రి బాగా డబ్బున్నవాడు కావడమే.అవును..సాయి అనీష్ రెడ్డి తండ్రి మరెవరో కాదు..హైదరాబాద్‌కు చెందిన ఏఎంఆర్ గ్రూప్ నిర్మాణ సంస్థ అధినేత మహేష్ రెడ్డే.

అందుకే టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి దర్శకుల వరకు, సైడ్ హీరోల నుండి చిన్న చిన్న పాత్రలు వేసే కమెడియన్స్ వరకు అంతా ఈ సినిమాని ఆహా,ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏకంగా రామ్ చరణ్ ,అఖిల్ వచ్చి సినిమా హైప్ ని అమాంతం పెంచిన సంగతి తెల్సిందే.

Advertisement

ఇక మహేష్ రెడ్డి స్నేహితుడైన అక్కినేని నాగార్జున అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదలెట్టిన ప్రెస్ మీట్ నుండి సినిమా ప్రీ రిలీజ్ వరకు ఒక రకంగా సినిమాకి భుజం కాశాడనే చెప్పాలి.ఇక మహేష్ రెడ్డి ,అక్కినేని నాగార్జునతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో షిరిడీ సాయి ,అలాగే నమో వేంకటేశాయ సినిమాలని నిర్మాతగా తెరకెక్కించాడు కూడా.

ఇక మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా సినిమా ప్రమోషన్స్ లో ఏదో రకంగా భాగమవుతూ సినిమా కి బజ్ పెంచేప్రయత్నం గట్టిగానే చేశారు.ఇక నిన్నటి ప్రీమియర్ కోసం వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా తెలుగు ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టిందనే చెప్పాలి.ఒక రకంగా ఒక పెద్ద హీరోకి ఏ రకంగా సినిమా ముందర పబ్లిసిటీ జరుగుతుందో అదే రకంగా కొత్త వాడైనా సాయి అనీష్ రెడ్డి సినిమా ‘ఇట్లు అర్జున’కి జరిగింది.ఇదంతా అతడి వెనకాల డబ్బు అనే బ్యాక్ గ్రౌండ్ ఉండటం అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

అయితే ఇంతవరకు బాగానే ఉంది కాని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఒక చిన్న సినిమా తీస్తే వీరంతా ఇలాగే సపోర్ట్ చేసి ఆదరిస్తే ఎంత బాగుంటుందో కదా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.మంచి కథతో వచ్చిన చిన్న చిన్న ఫిలిమ్ మేకర్స్ కి ,ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అద్భుతంగా నటించి మెప్పించిన నటులకి కూడా ఇలాగే ఒక మాట సాయమో ,ట్వీట్ సాయమో చేసి ఉంటే ఇంకెంత బాగుండేది కదా అంటూ ఎకిపారేస్తున్నారు.

అయితే అడపాదడపా అక్కడో ఇక్కడో కొంతమంది బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ అది అనుకున్న స్థాయిలో లేదని నెటిజన్ల వాదన.ఇక సినిమా విషయానికి వస్తే మొదటి సినిమా అయినా మూగవాడిగా బాగానే నటించాడన్న టాక్ వినిపిస్తుంది.చూడాలి మరి ముందు ముందు అయినా స్టార్స్ చిన్న సినిమాలకి భుజం కాస్తారో లేక డబ్బున్న వాళ్ళకే జై కొడతారో !

also read :రాబిన్‌హుడ్ ఫ్లాప్‌కు అసలు కారణం చెప్పేసిన వెంకీ కుడుముల!

Tags

Related News

‘రియాలిటీ’ లో రఘుకుల తిలకా రారా సాంగ్..కిరణ్ అబ్బవరం క్లారిటీ!

కవ్వించే ఫోజులతో గిలిగింతలు పెడుతున్న మెగా డాటర్ నిహారిక!

‘స్వాభిమానం’ పద్ధతిలో అనిరుధ్ – కావ్య పెళ్లి? దీని ఆంతర్యం ఏంటంటే?

ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతులు కీలక ఒప్పందం.. రూ.36 కోట్లు పెట్టుబడి

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపే దాదా ధమాకా!

పవన్ కళ్యాణ్ విడాకులపై మాధవీ లత సంచలన కామెంట్స్.. అసలు విషయం ఇదేనా?

ఆ సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వేస్ట్.. త్రివిక్రమ్‌పై నిర్మాత ఫైర్!

Big Stories

Advertisement
×