Shocking Train Scam: రైలు ప్రయాణాల్లో టికెట్ చెకింగ్ సాధారణమే. టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధించడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇదే రూల్ ను కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా రైల్వే టికెట్ చెకర్‌లా నటిస్తూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ కిలేడీ వ్యవహారం బట్టబయలైంది. ఓ రైల్వే ఉద్యోగి ఆమె అసలు బండారం బయటపెట్టాడు.
సికింద్రాబాద్ నుంచి హౌరాకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ రైల్వే ఉద్యోగి జనరల్ క్లాస్ టికెట్‌తో ప్రయాణిస్తున్నాడు. జనరల్ బోగీలో విపరీతమైన రద్దీ ఉండటంతో, స్లీపర్ కోచ్‌లోని ఓ ప్రయాణికుడిని అనుమతి అడిగి అతని సీటులో కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఓ మహిళ వచ్చింది. తాను టికెట్ చెకర్‌గా పరిచయం చేసుకుని, ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేయడం మొదలుపెట్టింది. చాలామంది ప్రయాణికుల దగ్గర సరైన టికెట్లు లేకపోవడంతో, వారిని జరిమానా పేరుతో డబ్బులు చెల్లించాలని ఆదేశించింది.
ఆ తర్వాత రైల్వే ఉద్యోగి దగ్గరకు వెళ్లి టికెట్ చూపించమని అడిగింది. అతడు తన దగ్గరున్న జనరల్ టికెట్‌ను చూపించాడు. అయినప్పటికీ, స్లీపర్ కోచ్‌లో కూర్చున్నందుకు జరిమానా చెల్లించాల్సిందేనని ఆమె పట్టుబట్టింది. దీంతో ఆ ఉద్యోగి తన రైల్వే ఐడీ కార్డును చూపించాడు. తాను కూడా రైల్వే ఉద్యోగినేనని, డ్యూటీలో భాగంగా ప్రయాణిస్తున్నానని వివరించాడు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు.
అనుమానం వచ్చిన రైల్వే ఉద్యోగి.. ముందుగా ఆమెను ఐడీ కార్డు చూపించాలని అడిగాడు. ఆమె కార్డు చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది ఏదో చైనీస్ కంపెనీకి చెందిన ఐడీ కార్డులా కనిపించింది. అందులోని వివరాలు నిజమైన రైల్వే గుర్తింపు కార్డులా లేకపోవడంతో అతనికి అనుమానం కలిగింది. దీంతో ఆమె అసలైన టికెట్ చెకర్ కాదని, నకిలీ గుర్తింపు కార్డుతో ప్రయాణికులను మోసం చేస్తోందని గుర్తించాడు.
వెంటనే ఆమెకు డబ్బులు చెల్లించేది లేదని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని గట్టిగా చెప్పాడు. దాదాపు అరగంట పాటు ఫోన్‌లో మాట్లాడుతూ అతన్ని భయపెట్టేందుకు ప్రయత్నించినా ఉద్యోగి వెనక్కి తగ్గలేదు. పోలీసులకు ఫోన్ చేయాలని సవాలు చేయడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ తర్వాత మిగిలిన ప్రయాణికుల టికెట్లను పరిశీలించగా, అవి కూడా నకిలీవేనని తెలిసింది. అంటే, టికెట్ చెకర్‌లా నటిస్తూ డబ్బులు వసూలు చేసి, ప్రయాణికులకు నకిలీ టికెట్లు ఇచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో రైలులో టికెట్ చెకింగ్ కోసం వచ్చే వ్యక్తుల ఐడీ కార్డులను పరిశీలించాలని సదరు రైల్వే ఉద్యోగి ప్రయాణికులకు సూచించాడు. అనుమానం వస్తే డబ్బులు చెల్లించే ముందు రైల్వే అధికారులకు, రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నాడు. అదే సమయంలో సదరు లేడీపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు రైల్వే అధికారులను కోరుతున్నారు.
जब रेलवे कर्मचारी ने महिला का आईडी कार्ड ध्यान से देखा, तो उसे शक हुआ कि यह रेलवे का असली पहचान पत्र नहीं है, बल्कि किसी चीनी कंपनी का आईडी कार्ड है
अब कर्मचारी को समझ आ गया कि उसके सामने कोई असली टीटी नहीं, बल्कि नकली टीटी बनकर यात्रियों से पैसे वसूलने वाली महिला है
वह तुरंत…
— 😊 NiTu 😊 (@NituTiw81600052) November 13, 2026
Read Also: రైలులో టికెట్ లేని ప్రయాణం.. ఆర్మీ జవాన్లు, మహిళా టీటీఈకి మధ్య గొడవ.. రెండుగా చీలిన నెటిజన్లు!