Kantara Chapter 1: ఒక సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే చాలు. ఆ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలా సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగు సినిమాలు కాకపోయినా కూడా డబ్బింగ్ సినిమాలు కూడా ఇక్కడ మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం “కాంతార” తమ సొంత రాష్ట్రంలోనే బాక్సాఫీస్ వద్ద అలవోకగా సంచలనం సృష్టించిన తర్వాత తెలుగులో విడుదలైంది.
ఈ చిత్రం మొదటి రోజు 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది, 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తుందని అందరూ ఊహించారు. అనుకున్నట్లే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. రెండు రోజుల మొత్తం కలెక్షన్ దాదాపు 11.5 కోట్లు అప్పట్లో వచ్చాయి. కాంతారా సినిమాకు ప్రీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కాంతారా చాప్టర్ 1 అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.
కాంతారా ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక చాప్టర్ వన్ కూడా సిద్ధం కావడంతో.. ఈ స్టోరీ లైన్ బయటికి వచ్చింది. US బుకింగ్ పోర్టల్ ప్రకారం కాంతారా చాప్టర్ 1 రన్‌టైమ్ – 2Hr 45 నిమిషాలు. ప్రధాన పాత్ర నాగ సాధువు (పవిత్ర సంరక్షకుడు) రిషబ్ శెట్టి (Rishabh Shetty) కదంబ రాజవంశం పాలనలో 300 సాధారణ యుగంలో (1725 సంవత్సరాల క్రితం) కథ సెట్ అవుతుంది . బనవాసిలోని ఆధ్యాత్మిక అడవులలో ఈ కథ జరుగుతుంది. దైవ సంప్రదాయం యొక్క మూలాలు & మానవులు మరియు దైవిక శక్తుల మధ్య పవిత్ర బంధంపై ఈ కథ కొనసాగనుంది.
కాంతార (Kantara) అనేది దేవత కోసం సాంప్రదాయ నృత్యమైన భూత కోలా యొక్క దైవిక అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించడమే కాకుండా, కాంతార లో కూడా రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రను అతను చేయబట్టే ప్రేక్షకులకి గూస్బంస్ వచ్చే మూమెంట్స్ కనిపించాయి. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ (saptami Gowda) మరియు ప్రమోద్ శెట్టి (Pramod Shetty) కూడా కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ (hombale films) పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : Sai Tej : ఆ పసిపాప గురించి మీడియా స్పందిస్తుందేమో అని ఎదురు చూశా, సాయి తేజ్ ఆవేదన