BigTV English

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి హత్య చేసే కిల్లర్… 6 నెలల తరువాత ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి హత్య చేసే కిల్లర్… 6 నెలల తరువాత ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

OTT Movie : మంచి థ్రిల్ ఇచ్చే కిల్లర్ సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు ఓటీటీ ప్రియులు. అయితే తాజాగా ఇలాంటి ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


6 నెలల తరువాత ఓటీటీలోకి..

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ (Artiste) ఈ ఏడాది మార్చి 21న థియేటర్లలో సందడి చేసింది. బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగు పెట్టింది. కానీ ట్విస్ట్ ఏంటంటే… ఇది ఫ్రీ స్ట్రీమింగ్ కాదు, రెంట్ విధానంలోనే అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 12 (శుక్రవారం) నుంచి ‘కిల్లర్ ఆర్టిస్ట్’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రూ.99 రెంట్ చెల్లిస్తే ఈ థ్రిల్లర్‌ను ఇంట్లో నుంచే చూసి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్ రిలీజ్ తర్వాత ఎలాంటి హడావిడి లేకుండా, ఇలా సైలెంట్ గా ఈ మూవీ రెంట్ మోడ్‌లో ఓటీటీలోకి రావడం ఆసక్తికరం. ఈ సినిమాకు IMDbలో ఏకంగా 8.8 రేటింగ్ ఉంది. బిగ్ బాస్ స్టార్ సోనియా ఆకుల కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు.

రతన్ రిషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, కాలకేయ ప్రభాకర్, వినయ్ వర్మ, సత్యం రాజేష్, తనికెళ్ల భరణి లాంటి నటీనటులు నటించారు. కథ ఒక సైకో కిల్లర్, అన్నాచెల్లెళ్ల ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందింది. 64 కళలకు మించి, హత్యను 65వ కళగా చూపించే కాన్సెప్ట్ ఈ సినిమాకు హైలైట్. క్లైమాక్స్‌ ట్విస్ట్ కొన్ని లాజిక్ లోపాలు మినహాయిస్తే బాగుంటుంది.


స్టోరీలోకి వెళ్తే..

ఒక సైకో కిల్లర్ అమ్మాయిలపై అఘాయిత్యం చేసి, చంపేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన చెల్లెలు కూడా ఈ కిల్లర్ బాధితురాలవడంతో.. ఓ అన్న ప్రతీకార జ్వాలతో రగిలిపోతాడు. మరి ఆ తరువాత బ్రదర్, కిల్లర్ మధ్య ఎలాంటి ఫైట్ జరిగింది? చివరికి బ్రదర్ ఈ కిల్లర్ ను పట్టుకోగలిగాడా? ఆ కిల్లర్ అమ్మాయిలనే టార్గెట్ చేసి చంపడానికి గల కారణం ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. అయినప్పటికీ ఈ మూవీ ఓటీటీలో రెంట్ మోడ్‌లో అందుబాటులో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మీకు కూడా కిల్లర్ సినిమాలంటే ఇష్టమా? అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ను చూసేయండి. మీకు థ్రిల్ గ్యారెంటీ.

Read Also : కళ్ళు కన్పించని కన్నిబలిస్టిక్ జీవులు… ట్రిప్పుకెళ్లి అడ్డంగా బుక్కయ్యే గ్రూప్… ఒళ్ళు జలదరించే సీన్స్

Related News

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

OTT Movie : చనిపోయిన భార్యతో కనెక్ట్ అవ్వడానికి అలాంటి పని… నెక్స్ట్ ట్విస్టుకు గుండె గుభేల్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీ

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి..మూవీ లవర్స్ కు పండగే..!

OTT Movie : కళ్ళు కన్పించని కన్నిబలిస్టిక్ జీవులు… ట్రిప్పుకెళ్లి అడ్డంగా బుక్కయ్యే గ్రూప్… ఒళ్ళు జలదరించే సీన్స్

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

Big Stories

×