E-Paper
Advertisement

Sai Tej : ఆ పసిపాప గురించి మీడియా స్పందిస్తుందేమో అని ఎదురు చూశా, సాయి తేజ్ ఆవేదన

Sai Tej : ఆ పసిపాప గురించి మీడియా స్పందిస్తుందేమో అని ఎదురు చూశా, సాయి తేజ్ ఆవేదన
Advertisement

Sai Tej : మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోల్లో సాయి తేజ్ ఒకరు. రేయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు సాయి తేజ్.

సాయి తేజ్ వ్యక్తిత్వం చాలా మందికి ఇష్టం. సాయి తేజ్ జీవితంలో అనుకొని ఒక సంఘటన జరిగింది. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. అయితే సోషల్ మీడియాలో చిన్న పిల్లలపైన జరుగుతున్న అబ్యూజ్ ను సాయి తేజ్ తన సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు. ఒక్కసారిగా మీడియా అంతా అప్పుడు దానిపైన ఫోకస్ చేయడం మొదలుపెట్టింది.

Advertisement

ఆ సంఘటనతో ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ జైలు పాలు కూడా అయ్యాడు. ప్రస్తుతం అతను బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. సరికొత్త కంటెంట్ తో మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ కూడా ప్రారంభించాడు. అయితే మళ్లీ సాయి తేజ్ అదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంట్రాక్షన్ లో బయటకు తీశాడు. మీడియా ముఖంగా ఆ ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకున్నాడు.

సాయి తేజ్ ఆవేదన

నేను దాదాపు 24 గంటలు ఏదైనా మీడియా దీని గురించి రైజ్ చేస్తుంది అనుకుని ఎదురు చూశాను. కానీ ఎవరూ కూడా ఈ టాపిక్ పట్టించుకోలేదు. చాలామంది నాన్సెన్స్ రాస్తుంటారు కానీ ఇలాంటి వాటి గురించి రాయరు. నాకు చాలా బాధనిపించింది. కొన్ని అఫైర్ల గురించి, కొన్ని నాన్ అఫైర్స్ గురించి రాస్తుంటారు. కానీ ఆ పసిపాప గురించి ఒక హెడ్డింగ్ లేదు.

Advertisement

అయితే గతంలో సాయి తేజ్ రియాక్ట్ అయిన ఆ పోస్టును కూడా వేరే వాళ్ళతో ఆన్ స్టేజ్ లాంగ్వేజ్ గురించి క్షమించండి అంటూ చదివించాడు. ఆ కంటెంట్ ని చదివించి ఆవేదనకు గురి అయ్యాడు. ఆ పోస్ట్ పెట్టినందుకు 137 మంది రియాక్ట్ అయ్యారు. నేను నిజంగా దేని గురించి యుద్ధం చేయాలి అనుకున్నాను అంటే ఆ 137 మంది నవ్వి లవ్ సింబల్ ఇచ్చారు కదా అది కరెక్ట్ కాదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం. మన సొసైటీ మన ఇండియన్ కిడ్స్ అది చేస్తున్నారు.

మీకు ఆ పోస్ట్ ని బట్టి అర్థమవుతుందా ఫ్యూచర్ జనరేషన్ అనేది ఎలా ఉండబోతుందో. నేను ఆ టైంలో సోషల్ మీడియాను బర్న్ డౌన్ చేయాలనుకున్నాను. అమ్మాయికి కేవలం నాలుగు సంవత్సరాలు. నేను వాయిస్ రైజ్ చేసిన తర్వాత, ఆ అమ్మాయి నాకు వాయిస్ నోట్ పంపించింది అంటూ అది వినిపించారు.

Also Read: Tg viswa Prasad: నాకు డబ్బులు ఊరికే రాలేదు… మిరాయ్ రిలీజ్ తర్వాత నిర్మాత ఫైర్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×