ANANTAPUR: కూతురు వరుస అయ్యే అమ్మాయితో ఓ కామాంధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి అసభ్యకర మెసేజులు పంపడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా అమ్మవారిపల్లిలో చోటుచేసుకుంది.యువతి చెనైలో ఎంజిఆర్ యూనివర్సిటీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సొంత అన్న కూతురు అని లేకుండా ఆమె బాబాయ్ వెంకటరెడ్డి లైంగికంగా వేధించాడు. అశ్లీల ఫొటోలు పంపించి, అర్ధరాత్రి వీడియో కాల్ చేయమన్నాడు. పిన్ని ఊరులో లేదు మూడ్ వస్తుందంటూ అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.