E-Paper
Advertisement

S.P. Balasubrahmanyam Statue : విగ్రహం గురించి SP బాలు అంటే తిట్టారు… ఎస్‌పీ శైలజ ఎమోషనల్

S.P. Balasubrahmanyam Statue : విగ్రహం గురించి SP బాలు అంటే తిట్టారు… ఎస్‌పీ శైలజ ఎమోషనల్
Advertisement

S.P. Balasubrahmanyam Statue: ప్రముఖ దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం(S.P. Balasubrahmanyam) ఈ లోకాన్ని విడిచి వెళ్లిన పాటల రూపంలో ఈయన ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పాలి. వివిధ భాషలలో వేల సంఖ్యలో పాటలను ఆలపిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న బాలసుబ్రమణ్యం గారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పాలి. గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న బాలసుబ్రమణ్యం గారి విగ్రహావిష్కరణ విషయంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఏర్పాటును పలువురు తెలంగాణవాదులు, అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఏర్పాటు..

ఈ వివాదం సర్దుమనగడంతో బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ నేడు రవీంద్రభారతిలో జరిగింది. భారీ పోలీసు బందోబస్తు నిర్వహించి ఈ విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎస్పీ శైలజ(ఎం.P.Sailaja) మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు సంగీతంలో ఒక కొత్త వరవడిని సృష్టించారని తమకు ఒక మంచి బాట వేశారని బాలసుబ్రమణ్యం గారి గురించి తెలియజేశారు.

Advertisement

నెరవేరిన ఎస్పీ బాలు కోరిక..

బాలు గారి విగ్రహ ఏర్పాటు విషయంలో చోటు చేసుకున్న వివాదం గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురవడంతో ఈ వివాదం గురించి తనకు తెలియదు అంటూ సమాధానం దాటివేశారు. అలాగే రవీంద్రభారతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల కూడా ప్రశ్నలు ఎదురవడంతో ఎస్పీ శైలజ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. రవీంద్ర భారతిలో ఓ కార్యక్రమంలో భాగంగా అన్నయ్య పాల్గొని నేను చనిపోయిన తర్వాత ఇక్కడ నా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సాధారణంగానే మాట్లాడారట. అయితే చనిపోక ముందే అక్కడ విగ్రహ ఏర్పాటు చేయాలని చెప్పిన అన్నయ్య కోరిక నేడు నెరవేరిందని శైలజ కాస్త ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఇలా చనిపోక ముందే రవీంద్ర భారతిలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు అవేం మాటలు అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ అందరూ అన్నయ్యను తిట్టారు. కానీ చనిపోయిన తర్వాత అన్నయ్య అనుకున్న విధంగానే తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల శైలజ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో బాలసుబ్రమణ్యం గారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి నిరాకరించారట ఈ నేపథ్యంలోనే బాలసుబ్రమణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయటానికి వీలు లేదు అంటూ పలువురు తెలంగాణవాదులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్పకుంట్ల కవిత ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వంటి వారు గతంలో వ్యతిరేకించారు. ఇక ఈ విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా పలువురు తెలంగాణ వాదులను హౌస్ అరెస్ట్ చేసి భారీ బందోబస్తు నడుమ బాలు గారి విగ్రహావిష్కరణ చేశారు.

Also Read: Bigg Boss 9: మహిళా కంటెస్టెంట్‌ను తన్నాడు… బిగ్ బాస్‌ హస్‌లో రివేంజ్ గేమ్స్

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×