Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)ఒకరు.. ఈయన దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను నిరాశ పరచలేదని చెప్పాలి. ఇలా వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్న అనిల్ రావిపూడి అపజయం ఎరుగని దర్శకుడిగా స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అనిల్ రావిపూడి చివరిగా వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమా అనంతరం ఈయన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నారు . అయితే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమాలకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నారని లేదు బాలయ్యకు మరొక కథ చెప్పారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అనిల్ రావిపూడి మాత్రం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే రామ్ పోతినేనికే అనిల్ రావిపూడి స్టోరీ లైన్ వినిపించడంతో అది నచ్చిన రామ్ ఈయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారట అయితే ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)తన ఎస్విసి బ్యానర్లు నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ఒకరోజు ముందుగానే ఆంధ్ర కింగ్ తాలూకా..
ఈ సినిమాను మహేశ్ బాబు (Mahesh Babu) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రామ్ పోతినేనికి జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా ఈ పాటలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాని నవంబర్ 28వ తేదీ విడుదల చేయాలని మేకర్స్ భావించారు కానీ ఒకరోజు ముందుగానే అనగా నవంబర్ 27వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనంతరం రామ్ అనిల్ డైరెక్షన్లో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.
Also Read: Yash Toxic: టాక్సిక్ సినిమా విడుదల వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!