Sai Durga Tej : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సాయి తేజ్. రేయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సాయికి మొదటి సినిమా అనుకున్న సక్సెస్ ఇవ్వలేదు. ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం సినిమా మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకునే ప్రయత్నం చేశాడు గానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ. కానీ సాయి కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే రిపబ్లిక్ అని చెప్పాలి.
ఆ సినిమా విడుదలైనప్పుడు సాయి తేజ్ జీవితంలో ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్లి మళ్లీ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సాయి తేజ్ కోలుకున్న తర్వాత చేసిన విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు సాయి తేజ్.
వెబ్ సిరీస్ చూసి నా పెళ్లి గురించి అడిగారు
సాయి తేజ్ ప్రస్తుతం దేవకట్ట దర్శకత్వం వహించిన మయసభ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. సోనీ లీవ్ లో ఈ సిరీస్ ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ తరుణంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని పెట్టారు. ఈ ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యాడు సాయితేజ్. ఈ తరుణంలో దేవకట్ట గురించి కొన్ని ముఖ్యమైన మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఆది పినిశెట్టితో తనకున్న జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇక చైతన్యాన్ని ఉద్దేశిస్తూ నాకు చైతన్య శత్రువు. దీనికి కారణం ఆయన చేసిన 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ నాకు ఇంట్లో వాళ్ళు చూపించి చూడరా, పర్లేదు వర్క్ అవుట్ అవుతుంది పెళ్లి చేసుకోవచ్చు త్వరగా చేసుకో అని ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోక పోతే మీడియా వల్లే నీకు పెళ్లి అయిపోయింది అని రాసేయడం మొదలు పెట్టారు అంటూ సాయి తేజ్ తెలిపాడు.
మరో పాన్ ఇండియా సినిమా
ఇకపోతే సాయి తేజ్ విషయానికి వస్తే ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. విరూపాక్ష సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో కనిపించాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది. అతి త్వరగా ఆ సినిమాను పూర్తి చేయొచ్చు కాబట్టే పవన్ కళ్యాణ్ ఆ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. తనకు జరిగిన అనూహ్య సంఘటన తర్వాత సాయి తేజ్ మాటల్లో కొద్దిపాటి తేడా వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం సాయి తేజ్ మాటలు చాలా క్లారిటీగా ఉన్నాయి.
Also Read: Kingdom : కింగ్డమ్ బుకింగ్స్ బాగున్నాయి, ఇంతకీ డ్యూరేషన్ ఎంతంటే.?